ప్రియుడికి వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్.. పెట్రోల్ బాటిల్‌తో సహా ఆ ప్రేయసి నేరుగా అతడి ఇంటికెళ్లి..
ABN , First Publish Date - 2022-04-30T15:25:51+05:30 IST
ప్రేమలో ఉన్నప్పుడు చెప్పే మాటలకు.. పెళ్లి వరకు వచ్చే సరికి చెప్పే మాటలకు చాలా తేడా ఉంటుంది. ప్రేమ పేరుతో యువతులకు మాయ మాటలు చెప్పే యువకులు.. తీరా...
ప్రేమలో ఉన్నప్పుడు చెప్పే మాటలకు.. పెళ్లి వరకు వచ్చే సరికి చెప్పే మాటలకు చాలా తేడా ఉంటుంది. ప్రేమ పేరుతో యువతులకు మాయ మాటలు చెప్పే యువకులు.. తీరా పెళ్లి విషయం వచ్చే సరికి మోసం చేయడం తరచూ చూస్తూనే ఉన్నాం. చివరకు మోసపోయామని తెలుసుకున్న యువతులు.. ఆత్యహత్య చేసుకోవడమో, ప్రియుడి ఇంటి ముందు ధర్నా చేయడమో చేస్తుంటారు. మధ్యప్రదేశ్‌లో ఓ యువకుడు కూడా ప్రేమ పేరుతో యువతిని నమ్మించాడు. అయితే చివరికి వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు. దీంతో బాధితురాలు ప్రియుడి ఇంటి ముందు చేసిన పని.. తీవ్ర సంచలనానికి దారి తీసింది. వివరాల్లోకి వెళితే...
మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న సతేంద్ర సింగ్ చౌహాన్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఇతడి కుమార్తె సృష్టి చౌహాన్ (21).. స్థానికంగా ఉంటున్న ఓ కళాశాలలో బీఎస్సీ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఇదే ప్రాంతంలో ఇంకో కళాశాలలో చదువుకుంటున్న ఆశిష్ పాఠక్‌తో యువతికి ఐదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని, జీవితాంతం బాగా చూసుకుంటానని చెప్పడంతో యువతి అతడికి దగ్గరైంది. అప్పటి నుంచి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వీరి ప్రేమ విషయం గురించి యువతి.. తన తండ్రికి కూడా తెలియజేసింది. వారితో మాట్లాడి పెళ్లి చేయాలని యువతి తండ్రి కూడా నిర్ణయించుకున్నాడు.
కూతురి పీకలమీదకు తెచ్చిన తండ్రి నిర్వాకం.. ఆమెను ప్రేమిస్తున్న కుర్రాడి వద్ద అప్పు తీసుకుని..
అయితే కొన్ని రోజుల క్రితం ఆ యువకుడికి వేరే యువతితో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం తెలుసుకుని సృష్టి చౌహాన్ షాక్ అయింది. పెట్రోల్ బాటిల్ తీసుకుని శుక్రవారం నేరుగా ప్రియుడి ఇంటి వద్దకే వెళ్లింది. బయటికి రమ్మని యువతి పిలిచినా ప్రియుడు మాత్రం స్పందించలేదు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన యువతి.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. స్థానికులు గమనించి, ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే 90శాతం కాలిపోవడంతో యువతి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.