Abn logo

బిసీ బేళా బాత్‌

v>కావలసిన పదార్థాలు
 
బియ్యం - 1 కప్పు, కందిపప్పు - అర కప్పు, చింతపండు - నిమ్మకాయంత, ఉల్లిపాయ - 1, బీన్స్‌-5, కారెట్లు -2, ఆలు - 1, పచ్చిబఠాణి - గుప్పెడు, టమోటో - 1, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 1 టేబుల్‌ స్పూను, మసాలా పొడి - 1 టీ స్పూను, ఎండుకొబ్బరి తురుము - అర కప్పు, ఆవాలు - అర టీ స్పూను, మెంతులు - పావు టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, ఇంగువ - పావు టీ స్పూను.
 
తయారుచేసే విధానం
బియ్యాన్ని కాస్త మెత్తగా, పప్పును మామూలుగా ఉడికించుకుని పక్కనుంచుకోవాలి. కడాయిలో నూనె వేసి తాలింపుగింజలు, ఇంగువ, కరివేపాకు వేగనిచ్చి, తరిగిన కూరగాయల ముక్కలు కూడా వేసి సన్నని మంటపై కాస్త మెత్తబడేదాకా వేగనివ్వాలి (కాప్సికం లేకుండా). చింతపండు, ఉప్పు, కొబ్బరి తురుము, మసాలాపొడి వేసి మరికాసేపు వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన అన్నం, (మెదిపిన) పప్పును కలపాలి. కాప్సికంను విడిగా నేతిలో ఒక నిమిషం పాటు వేగించి బిస్‌బేలాబాత్‌పై అలంకరించుకోవాలి. దీనితో అప్పడాలు నంజుకుంటూ, ఉల్లి రైతాతో తింటే చాలా బాగుంటుంది.

ఉల్లంఘనులుప్రజల వద్దకే వ్యాక్సినేషన్‌ బృందాలుచలితో ఆసిఫాబాద్‌ ఏజెన్సీ గజగజప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి: రాహుల్‌రాజ్‌పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలిసైబర్‌ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలిపులిదాడిలో ఆవు మృతి విద్యుత్‌ తీగలు తగిలి ఒకరి మృతిసంస్కృతిని సంప్రదాయాలను కాపాడాలి అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
Advertisement