బీట్‌రూట్‌ పెరుగు చట్నీ

ABN , First Publish Date - 2015-08-31T20:11:22+05:30 IST

కావలసిన పదార్థాలు: క్యారెట్లు లేక బీట్‌రూట్‌ - వంద గ్రా., అల్లం- 5 గ్రా., ఉల్లిపాయలు - 50 గ్రా., పెరుగు - 150 గ్రా., కొబ్బరి నూనె- 1 టేబుల్‌ స్పూను,

బీట్‌రూట్‌ పెరుగు చట్నీ

కావలసిన పదార్థాలు: క్యారెట్లు లేక బీట్‌రూట్‌ - వంద గ్రా., అల్లం- 5 గ్రా., ఉల్లిపాయలు - 50 గ్రా., పెరుగు - 150 గ్రా., కొబ్బరి నూనె- 1 టేబుల్‌ స్పూను, ఆవాలు - అర స్పూను, ఎండు మిర్చి - 2, కరివేపాకు - రెండు రెబ్బలు, పచ్చిమిర్చి - 2, ఉప్పు - రుచికి సరిపడా.
తయారుచేసే విధానం: ముందు కేరట్‌/ బీట్‌రూట్‌ను తురుముకొని పక్కనుంచుకోవాలి. కడాయిలో నూనె వేడి చేసి తరిగిన అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేగించుకోవాలి. ఉల్లిపాయలు మరీ గోల్డు రంగులోకి రాకుండా చూడాలి. తర్వాత కేరట్‌/బీట్‌రూట్‌ తురుమును కలిపి మరో రెండు నిమిషాల పాటు వేగించి దించేయాలి. ఇప్పుడు పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. కడాయిలో నూనె వేసి ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకులతో పోపు పెట్టి పెరుగు మిశ్రమంలో కలపాలి.

Updated Date - 2015-08-31T20:11:22+05:30 IST