పొట్లకాయ కొబ్బరికోరు

ABN , First Publish Date - 2015-09-04T16:11:25+05:30 IST

కావలసిన పదార్థాలు: పొట్లకాయ - 1, కారం - 2 టీ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, వెల్లుల్లి

పొట్లకాయ కొబ్బరికోరు

కావలసిన పదార్థాలు: పొట్లకాయ - 1, కారం - 2 టీ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, వెల్లుల్లి - 3 రేకలు, కరివేపాకు - 4 రెబ్బలు, కొబ్బరికోరు - 1 టేబుల్‌ స్పూను, నూనె - 2 టీ స్పూన్లు, పసుపు - చిటికెడు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర - అర టీ స్పూను చొప్పున, కొత్తిమీర - 1 కట్ట.
తయారుచేసే విధానం: పొట్లకాయని గింజలు లేకుండా శుభ్రం చేసి, చిన్నచిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి. కడాయిలో నూనె వేసి ముందుగా ఆవాలు, మినపప్పు, జీలకర్ర చిటపటమన్నాక పసుపు, కరివేపాకు, పొట్లకాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు కలపాలి. ముక్క మెత్తబడ్డాక కొబ్బరికోరుని కలిపి రెండు నిమిషాలు ఉంచి, దించేముందు కొత్తిమీర చల్లాలి.

Updated Date - 2015-09-04T16:11:25+05:30 IST