Abn logo

కందిపప్పు తెలగపిండి

కావలసిన పదార్థాలు: కందిపప్పు - 1 కప్పు, తెలగపిండి - అరకప్పు, ఎండుమిర్చి - 4, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర - అర టీ స్పూను చొప్పున, ఇంగువ - చిటికెడు, వెల్లుల్లి రేకలు - 4, కరివేపాకు - 4 రెబ్బలు.
తయారుచేసే విధానం : ముందుగా కప్పు నీరు మరిగించి అందులో తెలగపిండి వేసి మూతపెట్టి మెత్తగా ఉడికించి చల్లార్చి ఆరబెట్టాలి. మరో గిన్నెలో కందిపప్పు (బద్దలుగా) ఉడికించాలి. కడాయిలో నూనె వేసి ఎండుమిర్చి, వెల్లుల్లి రేకలు, మినప్పప్పు, ఇంగువ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసి వేగించాలి. తర్వాత ఉప్పు, తెలగపిండి, కందిపప్పు వేసి బాగా కలిపి 5 నిమిషాలు ఉంచి దించేయాలి. వేడి వేడి అన్నంతో తింటే ఎంతో రుచిగా ఉండే కూర ఇది

స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు తీర్మానంపోలీసుల వేధింపులతో యువకుడి ఆత్మహత్యాయత్నం విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు విధుల్లోకి తీసుకోవాలని ఫీల్డ్‌ అసిస్టెంట్ల వేడుకోలుఆస్తి పన్ను వసూళ్లపై నజర్‌పుడమికి పండగనేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌ నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలినర్సరీల్లో అన్ని రకాల మొక్కలు ఉండాలి: కలెక్టర్‌ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం
Advertisement
d_article_rhs_ad_1
Advertisement