శెనగల సొరకాయ కర్రీ

ABN , First Publish Date - 2016-01-05T15:56:28+05:30 IST

కావలసిన పదార్థాలు: సొరకాయ -అరకిలో, మొలకెత్తిన శెనగలు - 100 గ్రాములు, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిరపకాయలు - ఐదు, కరివేపాకు - రెండు రెబ్బలు, జీలకర్ర,

శెనగల సొరకాయ కర్రీ

కావలసిన పదార్థాలు: సొరకాయ -అరకిలో, మొలకెత్తిన శెనగలు - 100 గ్రాములు, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిరపకాయలు - ఐదు, కరివేపాకు - రెండు రెబ్బలు, జీలకర్ర, ఆవాలు - ఒక టీ స్పూను, వెల్లుల్లి రేకలు - నాలుగు, కొత్తిమీర - ఒక కట్ట.
తయారుచేయు విధానం: మొలకెత్తిన శెనగల్ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. సొరకాయని చిన్న ముక్కలుగా కోసుకోవాలి. స్టౌ మీద గిన్నె పెట్టి నూనె పోయాలి. బాగా వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి రేకలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేగించాలి. తరువాత సొరకాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. ముక్కలు మెత్తబడ్డాక ఉడికించి పెట్టుకున్న శెనగలు , ఉప్పు కూడా వేసి సన్నని మంటపై ఓ పది నిమిషాలు ఉడికించాలి. చివర్లో కొత్తిమీర వేసి దించేయాలి.

Updated Date - 2016-01-05T15:56:28+05:30 IST