కొబ్బరి టమోటా చట్నీ

ABN , First Publish Date - 2015-09-01T22:44:50+05:30 IST

కావలసిన పదార్థాలు: ఎర్రటి టమోటాలు - ఒక కిలో, పచ్చికొబ్బరి కోరు - ఒక కప్పు, పాలు - ఒక కప్పు పంచదార

కొబ్బరి టమోటా చట్నీ

కావలసిన పదార్థాలు: ఎర్రటి టమోటాలు - ఒక కిలో, పచ్చికొబ్బరి కోరు - ఒక కప్పు, పాలు - ఒక కప్పు పంచదార - ఒఝటిన్నర కప్పు దాసించెక్క - అంగుళం ముక్క, కరివేపాకు - 4 రెబ్బలు, ఎండుమిర్చి - 4, పోపు గింజలు - ఒక టీ స్పూను, పోపుకు తగినంత నూనె.
తయారుచేసే విధానం
టమోటాలను శుభ్రం చేసుకుని నాలుగేసి ముక్కలుగా కోసి ఉంచుకోవాలి. స్టౌవ్‌పైన మూకుడు పెట్టి నూనె వేడయ్యాక ఎండుమిర్చి, పోపు గింజలు వేసి అవి వేగాక, కప్పునీటిని జతచేయాలి. నీళ్లు మరుగుతుండగా టమోటా ముక్కల్ని వేసి నీరు ఇంకిపొయ్యేంత వరకూ మెత్తగా ఉడికించాలి. మంటను తగ్గించి పంచదారను, పాలను వేసి కలపాలి. పంచదార కరిగేదాకా తిప్పుతూనే ఉండాలి. కొబ్బరి కోరును కూడా కలిపి మరోసారి తిప్పాలి. మరో ఐదు నిమిషాల పాటు ఉడికించి దించాలి. చల్లారాక పూరీ లేదా పరోటాలతో తింటే రుచిగా ఉంటుంది. తీయతీయగా, పుల్లపుల్లగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు.

Updated Date - 2015-09-01T22:44:50+05:30 IST