స్పైసీ ఎగ్‌ బజ్జీ

ABN , First Publish Date - 2017-07-08T17:24:07+05:30 IST

కావలసినవి: ఉడకబెట్టిన కోడిగుడ్లు- 5, కారం- ఒక టీస్పూను, ఆమ్‌చూర్‌పొడి- ఒక టీస్పూను, నూనె-సరిపడినంత.

స్పైసీ ఎగ్‌ బజ్జీ

కావలసినవి: ఉడకబెట్టిన కోడిగుడ్లు- 5, కారం- ఒక టీస్పూను, ఆమ్‌చూర్‌పొడి- ఒక టీస్పూను, నూనె-సరిపడినంత. 
 
పిండి కోసం: శెనగ పిండి- కప్పు, కారం-టీస్పూను, మిరియాలపొడి-చిటికెడు, ఉప్పు- తగినంత.
 
తయారీ విధానం: ఉడికిన కోడిగుడ్ల మీదున్న పెంకును తీసేసి రెండు ముక్కలుగా దాన్ని కట్‌ చేయాలి. అలా కట్‌ చేసిన గుడ్డు ముక్కల మీద కారం, ఆమ్‌చూర్‌ పొడి కొద్దిగా చల్లాలి. శెనగపిండిలో ఉప్పు, కారం, మిరియాలపొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి పిండి చిక్కగా కలుపుకోవాలి. ఆ పిండిలో ఎగ్‌ పీనెస్ ను ముంచి బాగా వేడెక్కిన నూనెలో వేసి అది బంగారువర్ణంలో వచ్చే వరకూ వేగించాలి. ఈ స్పైసీ ఎగ్‌ బజ్జీని సాస్‌తో కలిపి వేడివేడిగా తింటే ఎంతో మజాగా ఉంటుంది.

Updated Date - 2017-07-08T17:24:07+05:30 IST