మునగాకు భాజి

ABN , First Publish Date - 2017-03-04T15:37:20+05:30 IST

మునగాకుల్లో కమలా పండ్లలో కంటే విటమిన్‌-సి ఏడు రెట్లు, క్యారెట్లలో కంటే విటమిన్‌

మునగాకు భాజి

సూపర్‌ డూపర్‌ మునగాకు
మునగాకుల్లో కమలా పండ్లలో కంటే విటమిన్‌-సి ఏడు రెట్లు, క్యారెట్లలో కంటే విటమిన్‌-ఎ నాలుగు రెట్లు, పాలలో కంటే క్యాల్షియం నాలుగు రెట్లు, అరటిపండ్లలో కంటే పొటాషియం మూడు రెట్లు, పెరుగులో కంటే ప్రొటీన్‌ రెండు రెట్లు ఎక్కువగా ఉంటాయి. పిల్లల్లో రక్తహీనతకు మునగాకు మంచి మందు. మన దగ్గర మునగాకుల్ని అంతగా పట్టించుకోరు. కాని ఆఫ్రికాలో పోషకాహారలోపంతో బాధపడే పిల్లలకు ఈ ఆకుల పొడిని ఇస్తుంటారు. ఈ పొడి తీసుకున్న పిల్లలు బరువు పెరుగుతారు. మొత్తంగా ఆరోగ్యం బాగుంటుంది. గర్భిణులు దీన్ని సేవించడం వల్ల పిల్లలు మంచి బరువుతో పుడతారు. రక్తహీనత బారినపడకుండా ఉంటారు. ఈ మధ్య మన దగ్గర కూడా ఈ ఆకులతో తయారుచేసిన కుకీలు, హెర్బల్‌ టీ ప్రాచుర్యం పొందుతున్నాయి. మనగాకుల్ని మెంతి, పాలకూరలకు బదులుగా వాడతారు. అంతేకాదు యువతరం ఎంతో ఇష్టంగా తినే పిజ్జా, ఆమ్లెట్లలో మునగాకుల్ని వాడుతున్నారు.
 
 
మునగాకు భాజి
 
కావలసిన పదార్థాలు
ఉల్లిపాయ పెద్దది (సన్నగా తరిగి) - ఒకటి, టొమాటో (తరిగి) - సగం, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - ఒక టీస్పూన్‌, పసుపు, కారం - ఒక్కోటి అర టీస్పూన్‌ చొప్పున, గరం మసాలా, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - మూడు టేబుల్‌ స్పూన్లు.
 
కావలసిన పదార్థాలు
పాన్‌లో నూనె వేడిచేసి ఉల్లి, టొమాటో తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌లు వేసి వేగించాలి. తరువాత ఇతర మసాలా దినుసులు వేసి బాగా కలపాలి. తరువాత మునగాకులు వేసి కొన్ని నిమిషాలు ఉడికించాలి. అన్నంతో కానీ, చపాతీలతో కానీ తింటే చాలా బాగుంటుంది.

Updated Date - 2017-03-04T15:37:20+05:30 IST