నిమ్మచారు

ABN , First Publish Date - 2015-09-02T20:34:15+05:30 IST

కావలసిన పదార్థాలు: కందిపప్పు లేదా పెసరపప్పు - 100 గ్రా., నిమ్మరసం - 2 టీ స్పూన్లు, ఉప్పు

నిమ్మచారు

కావలసిన పదార్థాలు: కందిపప్పు లేదా పెసరపప్పు - 100 గ్రా., నిమ్మరసం - 2 టీ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, కరివేపాకు- 4 రెబ్బలు, కొత్తిమీర తరుగు - 1 టేబుల్‌ స్పూను, పచ్చిమిర్చి - 3, నెయ్యి - అర టేబుల్‌ స్పూను, ఆవాలు + మెంతులు + ఇంగువ + జీలకర్ర - తాళింపుకు సరిపడా.
తయారుచేసే విధానం: పప్పుని ఉడికించి పై నీరంతా తీసి పక్కనుంచాలి. (పప్పు బద్దలు ఏమాత్రం ఉండకూడదు) కడాయిలో నెయ్యి వేసి ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ, పచ్చిమిర్చితో తాలింపు పెట్టి మరగనివ్వాలి. దించేసి ఉప్పు, నిమ్మరసం వేసి మూతపెట్టి కాసేపు ఉంచాలి. (నిమ్మరసం వేశాక మరిగిస్తే చారు చేదైపోతుంది).

Updated Date - 2015-09-02T20:34:15+05:30 IST