Abn logo

కశ్మీరీ మటన్‌ కోఫ్తా

కావలసినవి
 
కోఫ్తా కోసం: మటన్‌ - అరకేజీ, ఎండు మిర్చి - నాలుగైదు, ఇంగువ - చిటికెడు, గరంమసాల - ఐదు గ్రాములు, సోంపు పొడి - ఐదు గ్రాములు, శొంఠి పొడి - ఐదు గ్రాములు, ధనియాల పొడి - ఐదు గ్రాములు, పెరుగు - ఇరవై గ్రాములు, ఆవాల నూనె - కొద్దిగా, ఉప్పు - రుచికి తగినంత.
గ్రేవీ కోసం: ఆవాల నూనె - 75 ఎంఎల్‌, ఇంగువ - చిటికెడు, యాలకులు - రెండు, జీలకర్ర - రెండు గ్రాములు, కారం - మూడుగ్రాములు, నీళ్లు కొద్దిగా.
 
తయారీవిధానం
మటన్‌కు అన్ని రకాల మసాలాలు పట్టించి నలభైఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఎండు మిర్చి, జీలకర్ర, ఇంగువ, యాలకులు వేయాలి. చిన్న మంటపై ఉడికించాలి. మటన్‌ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ వేయాలి. అన్ని వైపులా సమానంగా ఫ్రై అయ్యేలా కోఫ్తాలను అప్పుడప్పుడూ తిప్పుతూ ఉండాలి. పాన్‌పై మూత పెట్టి కాసేపు ఉడికించాలి. వేడి వేడి అన్నంతో ఈ కోఫ్తా కర్రీని సర్వ్‌ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది.

సామాజిక సేవలో పోలీసులుపలుచోట్ల కరోనా నిర్దారణ క్యాంపులుసౌదీ నుంచి కూచన్‌పెల్లికి చేరుకున్న మృతదేహంవిద్యుదాఘాతంతో హార్వెస్టర్‌ ఆపరేటర్‌ మృతినీటితొట్టిలో పడి బాలుడు మృతిరైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలిపొదుపు సంఘాలకు ప్రోత్సాహమేదీ ?బడికి డుమ్మా..!పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాలి: కలెక్టర్‌రైతు వేదిక నిర్మాణంపై కేటీఆర్‌కు ట్వీట్‌
Advertisement
Advertisement