రొయ్యల పకోడీ

ABN , First Publish Date - 2018-07-14T20:37:51+05:30 IST

ఉప్పు- రెండు టీస్పూన్లు, శెనగపిండి- ఒక కప్పు, వెల్లుల్లి పేస్టు-ఒక టీస్పూను, పసుపు- అర టీస్పూను..

రొయ్యల పకోడీ

కావలసినవి
 
రొయ్యలు-పావుకిలో (శుభ్రంగా కడిగి).
మిక్సింగ్‌ కోసం: ఉప్పు- రెండు టీస్పూన్లు, శెనగపిండి- ఒక కప్పు, వెల్లుల్లి పేస్టు-ఒక టీస్పూను, పసుపు- అర టీస్పూను, ఎర్రకారం-అర టీస్పూను, సన్నగా తరిగిన పచ్చిమిర్చిముక్కలు -ఒక టీస్పూను, కొత్తిమీర తరుగు-ఒక టేబుల్‌స్పూను, ఆమ్చూర్‌ - ఒక టీస్పూను, నీళ్లు- రెండుకప్పులు, నూనె- వేగించడానికి సరిపడా.
 
తయారీ
రొయ్యలను బాగా కడగాలి. నీళ్లు ఉండకుండా వార్చేయాలి. శెనగపిండి, వెల్లుల్లిపేస్టు, ఉప్పు, ఎండుకారం మిశ్రమంలో తగినన్ని నీళ్లు పోసి చిక్కటి పేస్టులా చేసుకోవాలి. దాంట్లో అవసరాన్ని బట్టి నీళ్లు పోసి పిండిని కాస్త పలుచగా చేసుకోవచ్చు. కడాయిలో సరిపడా నూనె పోసి వేడిచేయాలి. రొయ్యలను ఈ పిండిలో ముంచి సన్నని మంటపై నూనెలో వేసి లేత బంగారువర్ణంలోకి వచ్చేదాకా వేగించాలి. చిల్లుల గరిటెతో పకోడీని బయటకు తీయాలి. వాటిని నూనె పీల్చే కాగితంపై కాసేపు ఉంచాలి. ఈ స్నాక్‌ను కెచ్‌ప కాంబినేషన్‌తో వేడి వేడిగా తింటే ఆ మజాయే వేరు.

Updated Date - 2018-07-14T20:37:51+05:30 IST