మటన్ జఫ్రానీ

ABN , First Publish Date - 2018-08-19T17:56:30+05:30 IST

మటన్ ఎముకలతో సహా : అరకేజీ, అల్లం వెల్లుల్లి పేస్టు : పావు కప్పు, యాలకులు : ఐదారు, దాల్చిన చెక్క : పెద్ద ముక్క, జాపత్రి :..

మటన్ జఫ్రానీ

కావలసిన పదార్థాలు
 
మటన్ ఎముకలతో సహా : అరకేజీ, అల్లం వెల్లుల్లి పేస్టు : పావు కప్పు, యాలకులు : ఐదారు, దాల్చిన చెక్క : పెద్ద ముక్క, జాపత్రి : మూడు, సాజీరా : ఒకటిన్నర చెంచా
బిర్యానీ ఆకు : ఒకటి, పచ్చిమిర్చి : పదిహేను, ఉల్లిపాయలు : మూడు, నెయ్యి : టేబుల్‌ స్పూన్, నూనె : పావుకప్పు, జీడిపప్పు : అరకప్పు(పేస్టులా చేసుకోవాలి), ఉప్పు : తగినంత
మటన్ ఉడికించన నీరు : రెండు కప్పులు
 
తయారీ విధానం
 
ముందుగా బాణలిలో నూనె, నెయ్యి వేడి చేసి యాలకులు, దాల్చిన చెక్క, జాపత్రి, సాజీరా, బిర్యానీ ఆకు వేయాలి. అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి. ఆ పేస్టు కూడా వేగాక మాంసం, పచ్చిమిర్చి, మటన ఉడికించిన నీరు, ఉప్పు వేసి మూత పెట్టాలి. మాం సం ఉడికిన తర్వాత జీడిపప్పు పేస్టు వేసి మంట తగ్గించి పదినిమిషాల వరకు ఉంచి దించేయాలి. అంతే మటన జఫ్రానీ రెడీ..

Updated Date - 2018-08-19T17:56:30+05:30 IST