న్యూటెల్లా పిజ్జా

ABN , First Publish Date - 2017-09-16T19:59:57+05:30 IST

గోధుమ పిండి - 4 కప్పులు, నీళ్లు, ఉప్పు - తగినంత, నెయ్యి - పరోటా కాల్చటానికి సరిపడా, న్యూటెల్లా...

న్యూటెల్లా పిజ్జా

కావలసిన పదార్థాలు
 
గోధుమ పిండి - 4 కప్పులు, నీళ్లు, ఉప్పు - తగినంత, నెయ్యి - పరోటా కాల్చటానికి సరిపడా, న్యూటెల్లా - 1 టేబుల్‌ స్పూను, నూనె - 1 టేబుల్‌ స్పూను.
తయారీ విధానం
 
పిండికి ఉప్పు, నూనె, నీళ్లు చేర్చి పిసుక్కోవాలి. పిండి ముద్దను సమ భాగాలుగా విభజించుకోవాలి. వీటిని పరోటాల్లా ఒత్తుకోవాలి. పరోటా మీద న్యూటెల్లా సగానికి పరిచి పరోటాను మధ్యకి మడవాలి. న్యూటెల్లా బయటకు రాకుండా అంచులు మూసేయాలి. ప్యాన్‌ వేడి చేసి నెయ్యి వేసి పిజ్జా పరోటాను రెండు వైపులా కాల్చుకోవాలి. మధ్యకు కోసి వేడిగా సర్వ్‌ చేయాలి.

Updated Date - 2017-09-16T19:59:57+05:30 IST