Abn logo

మష్రూమ్‌ విత్ బీన్స్‌ గార్లిక్‌

v id="pastingspan1">కావాల్సిన పదార్థాలు :మష్రూమ్స్‌ - 100 గ్రాములు, తాజా బీన్స్‌ - 200 గ్రామలు, టొమాటోలు - 2, ఉల్లిగడ్డ (తరిగి) - 2, వెల్లుల్లి, అల్లం ముక్కలు, కొబ్బరి - పావు కప్పు, మిరియాలపొడి, ఉప్పు, పసుపు తగినంత.
 
తయారీ : బాగా మరిగిన నీళ్లలో పొడవుగా కోసిన బీన్స్‌ వేసి ఉడకబెట్టాలి. అందులోకి చిటికెడు ఉప్పు, పసుపు వేయాలి. ముప్పావువంతు ఉడికాక బీన్స్‌ను వేరుచేసి చల్లార్చాలి. పాన్‌లో కొంచెం నూనె వేసి తరిగిన ఉల్లి, వెల్లుల్లి, కరివేపాకుతో పోపు పెట్టాలి. ఈ పోపులో ముక్కలుగా కోసిన మష్రూమ్స్‌ వేసి వేగించాలి. కాసేపయ్యాక చల్లారిన బీన్స్‌ వేసి మగ్గబెట్టాలి. పదినిమిషాల తరువాత పొడవుగా కోసిప టొమాటో ముక్కల్ని వేయాలి. ఆఖర్న తగినంత ఉప్పు, కొబ్బరి తురుము, మిరియాల పొడి వేసి మూత పెట్టాలి. బీన్స్‌తో మష్రూమ్‌ రెసిపి సిద్ధం. ఈ వంటకాన్ని స్నాక్స్‌లాగ తినొచ్చు. పిల్లలు దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు.

అడవుల సంరక్షణ అందరి బాధ్యతపోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివిపత్తి కొనుగోళ్లపై ప్రతిష్టంభనమెడికల్‌ కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలిబాలల హక్కులను కాపాడాలిఈ స్థలంలో నిర్మాణాలు చేపట్టవద్దుపోలీసు అమరవీరుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం రోగికి పరీక్షే...!దిగుబడిపై అన్నదాతల దిగాలు పోలీసు అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
Advertisement