Abn logo

చికెన్‌ బిర్యాని

కావలసిన పదార్థాలు: చికెన్‌ - ఒక కిలో, బాస్మతి బియ్యం - ఒక కిలో, గరం మసాలా - రెండు టీ స్పూన్లు, అల్లం ముద్ద - ఒక టేబుల్‌ స్పూను, నెయ్యి - రెండు టేబుల్‌ స్పూన్లు, వెల్లుల్లి ముద్ద - ఒక టేబుల్‌ స్పూను, పెరుగు - ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు, పచ్చిమిరపకాయలు - ఐదు, ఎండు మిరపకాయలు - ఆరు, పసుపు - చిటికెడు, కొత్తిమీర - ఒక కట్ట, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: ముందుగా మాంసాన్ని శుభ్రంగా కడిగి కొద్దిగా పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, పెరుగు వేసి బాగా కలిపి రెండు గంటల సేపు నానబెట్టాలి. బియ్యాన్ని కడిగి ఆర బెట్టాలి. ఐదు నిమిషాల తర్వాత వంతుకు రెండొంతులు నీళ్లు పోసి పొయ్యి మీద ఉడికించాలి. స్టౌ మీద మరో గిన్నె పెట్టి సరిపడా నూనె వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు పెరుగులో నానబెట్టిన మాంసాన్ని కొద్దిగా వేసి దానిపైన సగం ఉడికిన అన్నాన్ని వేయాలి. మళ్లీ ఒక పొర మిగతా మాంసాన్ని వేయాలి. దానిపై మిగిలిన అన్నాన్ని వేసి మూతపెట్టాలి. ఆవిరి బయటికి పోకుండా ఉండటానికి మూత అంచుకి మెత్తగా కలిపిన మైదా పిండిని పెట్టాలి. పిండి మొత్తం ఆరిపోయి పెచ్చులుగా వచ్చేసే వరకూ ఉడికించి దించేయాలి. ఘుమఘుమలాడే బిర్యాని తయారయినట్టే. చివర్లో కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలతో అలంకరించుకోవాలి.

వ్యూహాత్మకంగా సీఎం కే‌సీఆర్ అడుగులు..పల్లె, పట్టణ ప్రగతి పనులపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవుసోన్‌ చెక్‌పోస్ట్‌లో సీసీ కెమెరాలు అటవీ అధికారుల పనులు అడ్డుకున్న గ్రామప్రజలుమ్యాచింగ్‌ సెంటర్‌లో షార్ట్‌సర్క్యూట్‌లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలువిభజన వివాదంపరిశ్రమల స్థాపనతో ఉపాధి అవకాశాలుసమన్వయంతో వ్యాధుల నిర్మూలనకు కృషి చేయాలిశానిటేషన్‌ నిధుల్లో కోత
Advertisement
Advertisement