కావలసిన పదార్థాలు: పండిన అరటిపండ్లు - 6, పాలు - అరలీటరు, పంచదార - రుచికి తగినంత, యాలకుల పొడి - అర టీ స్పూను, పనస తొనలు -3 (ముక్కలు చేసుకోవాలి)
తయారుచేసే విధానం: అరటిపండ్లను మెత్తని గుజ్జులా చేసి అందులో పాలు, పంచదార, యాలకులపొడి వేసి బాగా కలుపుతూ చిక్కగా తయారుచేసుకోవాలి. తరువాత తరిగి ఉంచుకున్న పనస తొనల ముక్కల్ని కలపాలి. దీన్ని మట్టిపాత్రలో వేసి రిఫ్రిజిరేటర్లో ఉంచి, చల్ల చల్లగా తింటే ఎంతో రుచిగా ఉంటుంది.