మాంగో సందేశ్‌

ABN , First Publish Date - 2015-08-31T18:43:10+05:30 IST

కావలసినవి: మామిడి మిశ్రమాన్ని తయారుచేయడానికి కావల్సినవి: రంగు అర టీస్పూను, నీళ్ళు ఒక టేబుల్‌ స్పూను

మాంగో సందేశ్‌

కావలసినవి: మామిడి మిశ్రమాన్ని తయారుచేయడానికి కావల్సినవి: రంగు అర టీస్పూను, నీళ్ళు ఒక టేబుల్‌ స్పూను, నిమ్మరసం ఒక టీ స్పూను, చక్కెర ఏడు టీ స్పూన్లు, మామిడి కోరు రెండు పండ్లది. సందేశ్‌కు కావలసినవి: పనీర్‌ వంద గ్రాములు, పొడిచేసిన చక్కెర వంద గ్రాములు, నెయ్యి నాలుగు టీ స్పూన్లు, కావాలంటే కొంచెం ఎసెన్స్‌. పైన అలంకరించడానికి కొన్ని మామిడి ముక్కలు.
ఎలా చేయాలి: నీళ్ళను వేడిచేసి దానిలో రంగేసి పక్కన పెట్టండి. తర్వాత నిమ్మరసం, చక్కెర, మామిడికోరు వేసి పది నిమిషాలు ఉడికించండి. సందేశ్‌ పదార్థాలన్నిట్నీ మెత్తగా కలిపి ఎనిమిది ముక్కలుగా చేసుకోండి. ప్రతి ముక్క మధ్యలో గుంట చేసి దానిలో ఆ మామిడి మిశ్రమాన్ని నింపండి. పైన మామిడి ముక్కలు అలంకరించి చల్లబరిచాక వడ్డించండి.

Updated Date - 2015-08-31T18:43:10+05:30 IST