ఉసిరి మురబ్బా

ABN , First Publish Date - 2017-11-04T13:41:14+05:30 IST

ఉసిరికాయలు-100 గ్రాములు, చక్కెర-అరకప్పు, కుంకుమపువ్వు- కొద్దిగా, ఏలకులపొడి- కొద్దిగా...

ఉసిరి మురబ్బా

కావలసినవి
ఉసిరికాయలు-100 గ్రాములు, చక్కెర-అరకప్పు, కుంకుమపువ్వు- కొద్దిగా, ఏలకులపొడి- కొద్దిగా.
 
తయారీ
ఉసిరికాయల్లోని గింజలు తీసి చిన్నముక్కలుగా తరిగి మిక్సర్‌లో వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఒకటిన్నర కప్పు నీళ్లల్లో చక్కెర వేసి అది నీళ్లల్లో కరిగిన తర్వాత ఉసిరి తురుమును కూడా అందులో వేయాలి. చిన్న మంటపై మెత్తబడేవరకూ ఉసిరి తురుమును ఉడకనివ్వాలి. ఇలా తయారైన పాకం చిక్కబడి దగ్గరపడుతుంది. అప్పుడు దాన్ని స్టవ్‌ మీద నుంచి కిందకు దించి అందులో కుంకుమపువ్వు, ఏలకుల పొడి వేసి కలపాలి. చల్లారిన తర్వాత పొడి జాడీలో ఆమ్లా మురబ్బాను భద్రపరచాలి. ఈ మురబ్బా సంవత్సరం వరకూ నిలవ ఉంటుంది. దీన్ని కేబేజి లేదా పాలకూర రోటీలతో కలిపి తినొచ్చు. కశ్మీరీ రోటీలు, మెంతి, ఆలూ పరోటాలతో కలిపి తిన్నా ఎంతో బాగుంటుంది.

Updated Date - 2017-11-04T13:41:14+05:30 IST