Abn logo

గులాబ్‌ జమూన్‌ ఐస్‌ క్రీం కేక్‌

కావ

లసినవి: వెనిలా స్పాంజ్‌ కేక్‌ - 200గ్రా.( బేకరీలో దొరుకుతుంది), వెనీలా ఐస్‌క్రీం - ఒక పార్టీ పాక్‌, గులాబ్‌ జామూన్‌లు - 24, బాదం పలుకులు - 60గ్రా., పంచదార సిరప్‌ అవసరానికి తగినంత..
తయారీ విధానం:
వెనిలా స్పాంజ్‌ కేక్‌ని రెండు సమాంతర పొరలుగా చేయండి. కేక్‌ గిన్నె తీసుకుని అందులో ఐస్‌క్రీంని మృదువుగా చేసి వేయండి. దానిపైన వెనిలా స్పాంజ్‌ కేక్‌ మొదటి పొరని వేయండి. పంచదార పాకాన్ని దానిమీద పమానంగా పరుచుకునేలా పోయండి. తరువాత మరికొంచెం ఐస్‌క్రీంని దానిమీద పరవండి. పన్నెండు గులాబ్‌జామూన్‌లని తీసుకుని సగానికి కట్‌ చేసి ఐస్‌క్రీం పైన సర్దండి. మిగిలిన ఐస్‌క్రీం మొత్తాన్ని ఈ గులాబ్‌జామూన్‌ల పైన వేయండి. స్పాంజ్‌ కేక్‌ రెండవ పొరని పైన పెట్టి మళ్లీ పంచదార పాకంతో తడపండి. తరువాత ఫ్రీజర్‌లో పెట్టి ఐస్‌క్రీం మళ్ళీ గట్టిపడేవరకూ ఉంచి తీయండి. పైన గులాబ్‌జామూన్‌లతో, ఐస్‌క్రీంతో అలంకరించి బాదంపలుకులను చల్లి చల్లగా తినండి. ఇది రకరకాల రుచుల సమ్మేళనంతో చాలా బాగుంటుంది. చేయడం కూడా తేలికే కదూ.

అమాత్యా.. మాస్కులు మరిచితిరా?!వంద శాతం వ్యాక్సినేషన్‌కు కృషిఅభివృద్ధి పనులపై పెత్తనంపాతాళంలో విషం..!వట్టివాగు ప్రాజెక్టు కుడికాలువ గండి పూడ్చేదెన్నడు?ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలిపెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని ధర్నాకేజీబీవీలో మెనూపై గ్రంథాలయ చైర్మన్‌ ఆగ్రహంక్రాస్‌ కంట్రీ పోటీలకు ఎంపికైన క్రీడాకారులుయాసంగిలో పప్పుదినుసు పంటలు వేయాలి
Advertisement