Abn logo

వంకాయ పెసరపప్పు

కావలసిన పదార్థాలు: వంకాయలు - అరకిలో, పెసరపప్పు - పావుకిలో, కారం - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - 1 టేబుల్‌ స్పూను, ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినప్పప్పు (కలిపి ) - 1 టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, ఎండుమిర్చి - 4, వెల్లుల్లి రేకలు -5, పసుపు - చిటికెడు.
తయారుచేసే విధానం: పెసరపప్పుని దోరగా వేగించుకుని దానిలో పసుపు, తగినంత నీరు చేర్చి స్టౌవ్‌ మీద పెట్టాలి. పప్పు సగం ఉడికిన తర్వాత వంకాయ ముక్కలు, కారం వేయాలి. పప్పు, ముక్కలు మెత్తబడ్డాక దించేసి ఉప్పువేసి కలపాలి. తర్వాత కడాయిలో ఎండుమిర్చి, వెల్లుల్లి, మెంతులు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకుతో తాలింపు పెట్టి పప్పుని అందులో వేసి తిప్పాలి.
(మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో - ఇదే పద్ధతిలో కందిపప్పులో పండు (పసుపు వన్నె) వంకాయల్ని వేసి పప్పు చేస్తుంటారు. ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది)

స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు తీర్మానంపోలీసుల వేధింపులతో యువకుడి ఆత్మహత్యాయత్నం విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు విధుల్లోకి తీసుకోవాలని ఫీల్డ్‌ అసిస్టెంట్ల వేడుకోలుఆస్తి పన్ను వసూళ్లపై నజర్‌పుడమికి పండగనేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌ నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలినర్సరీల్లో అన్ని రకాల మొక్కలు ఉండాలి: కలెక్టర్‌ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం
Advertisement
d_article_rhs_ad_1
Advertisement