కాప్సికం గుత్తికూర

ABN , First Publish Date - 2015-09-03T15:46:26+05:30 IST

కావలసిన పదార్థాలు: క్యాప్సికం - 4, పల్లీలు, కొబ్బరి తురుము, పుట్నాలు, మినప్పప్పు - గుప్పెడు

కాప్సికం గుత్తికూర

కావలసిన పదార్థాలు: క్యాప్సికం - 4, పల్లీలు, కొబ్బరి తురుము, పుట్నాలు, మినప్పప్పు - గుప్పెడు చొప్పున, ఉప్పు - రుచికి తగినంత, కారం - 1 టీ స్పూను, పసుపు - చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్టు - 2 టీ స్పూన్లు, నూనె -3 టేబుల్‌ స్పూన్లు.
తయారుచేసే విధానం: కొద్ది నూనెలో మినప్పప్పు, పల్లీలు, కొబ్బరి తురుము, పుట్నాలు దోరగా వేగించాలి. చల్లారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్ది ఉప్పుతో కలిపి గ్రైండ్‌ చేసుకోవాలి. క్యాప్సికం తొడిమలు, గింజలు తీసి నూరుకున్న మిశ్రమం నింపి, కిందవైపు ప్లస్‌ గుర్తుగా కట్‌ చేయాలి. 2 టేబుల్‌ స్పూన్ల నూనెలో ఉల్లిపాయ తరుగు, ఉప్పు, పసుపు, కారం వేగించి కూరిన క్యాప్సికంతో పాటు మిగిలిన పల్లీ మిశ్రమం వేసి చిన్నమంటపై మగ్గించాలి. అన్నంలో కలుపుకోడానికి చాలా బాగుంటాయివి.

Updated Date - 2015-09-03T15:46:26+05:30 IST