Abn logo

పచ్చి బఠాణీ రాగి రొట్టె

కావ

లసిన పదార్థాలు: పచ్చిబఠాణి - 1కప్పు, రాగిపిండి - 1 కప్పు, పచ్చిమిర్చి - 2, జీలకర్ర - అర టీ స్పూను, ఇంగువ - చిటికెడు, కొత్తిమీర - గుప్పెడు, పచ్చికొబ్బరి తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు, ఉల్లి తరుగు - పావు కప్పు, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: పచ్చిబఠాణీలు కొద్దిగా ఉడికించి మెదపాలి. లోతైన పాత్రలో మెదిపిన బఠాణితో పాటు రాగిపిండి, జీలకర్ర, ఇంగువ, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొబ్బరి, ఉల్లి తరుగు, ఉప్పు వేసి (బఠాణి తడి సరిపోకపోతే కొద్దిగా నీరు వాడి) ముద్దలా కలపాలి. నిమ్మకాయ సైజులో పిండి తీసుకుని ప్లాస్టిక్‌ పేపర్‌పై సాధ్యమైనంత పలచగా వేళ్లతో వత్తి, పెనంపై నూనె రాసి రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. పెరుగు, నిమ్మకాయ చట్నీ కాంబినేషన్‌తో వేడివేడిగా తింటే రుచిగా ఉంటాయి.

అమాత్యా.. మాస్కులు మరిచితిరా?!వంద శాతం వ్యాక్సినేషన్‌కు కృషిఅభివృద్ధి పనులపై పెత్తనంపాతాళంలో విషం..!వట్టివాగు ప్రాజెక్టు కుడికాలువ గండి పూడ్చేదెన్నడు?ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలిపెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని ధర్నాకేజీబీవీలో మెనూపై గ్రంథాలయ చైర్మన్‌ ఆగ్రహంక్రాస్‌ కంట్రీ పోటీలకు ఎంపికైన క్రీడాకారులుయాసంగిలో పప్పుదినుసు పంటలు వేయాలి
Advertisement