Abn logo

కొబ్బరి పాన్‌ కేక్‌

కావలసిన పదార్థాలు: (గది ఉష్ణోగ్రతలో ఉండే) గుడ్లు - 4, కొబ్బరిపాలు - 1 కప్పు, వెనీలా ఎసెన్స్‌ - 2 టీ స్పూన్లు, తేనె - 1 టేబుల్‌ స్పూను, కొబ్బరి తురుము - అరకప్పు, బేకింగ్‌ సోడా - 1 టీ స్పూను, ఉప్పు - అర టీ స్పూను, కొబ్బరి నూనె లేదా బటర్‌ - కాల్చడానికి సరిపడా.
తయారుచేసే విధానం: నాన్‌స్టిక్‌ పెనాన్ని ముందుగానే చిన్న మంటపై వేడి చేసుకుని ఉంచాలి. ఒక పాత్రలో గుడ్లు బాగా గిలకొట్టి కొబ్బరిపాలు, వెనీలా ఎసెన్స్‌, తేనె కలపాలి. మరోపాత్రలో కొబ్బరి తురుము, బేకింగ్‌ సోడా, ఉప్పు కలపాలి. తర్వాత గుడ్ల మిశ్రమాన్ని కొబ్బరి తురుములోకి వంచి మరోసారి బాగా కలిపి పెనంపై కొబ్బరినూనె/ బటర్‌ రాస్తూ దోశల్లా వేసుకుని రెండువైపులా దోరగా కాల్చుకోవాలి. 

బాలింత అదృశ్యంపై బంధువుల ఆందోళనఅనుమానాస్పద స్థితిలో యువకుడి మృతిపల్లె ప్రకృతి వనాల సంరక్షణకు శ్రద్ధ తీసుకోవాలిఉద్యాన అభివృద్ధి పథకం ద్వారా రైతులకు రాయితీలుఅన్నదాత విలవిలపశుక్రాంతిపై పట్టింపు కరువుఘనంగా ప్రధాని మోదీ జన్మదినంవైభవంగా ఎంగిలి పూల బతుకమ్మఅసాంఘిక శక్తులకు సహకరించవద్దురైతువేదిక నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి
Advertisement
d_article_rhs_ad_1
Advertisement