చికెన్ బాల్స్
ABN , First Publish Date - 2015-08-30T18:35:04+05:30 IST
కావలసిన పదార్థాలు: బోన్‌లెస్ చికెన్ - 200 గ్రా., అల్లం ముక్కలు - 1 టీ స్పూను, సన్న గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - 3 టీ స్పూన్లు
కావలసిన పదార్థాలు: బోన్‌లెస్ చికెన్ - 200 గ్రా., అల్లం ముక్కలు - 1 టీ స్పూను, సన్న గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - 3 టీ స్పూన్లు, మెంతి ఆకు - 1 టేబుల్ స్పూను, తరిగిన పచ్చిమిర్చి - 1 టీ స్పూను, తరిగిన కొత్తిమీర -2 టీ స్పూన్లు, తరిగిన వెల్లులి ్ల- 1 టీ స్పూను, నలగ్గొట్టిన లవంగాలు - రెండు, కారం - అరస్పూను, గరమ్ మసాలా - అరస్పూను, రుచికి తగినంత ఉప్పు.
తయారుచేసే విధానం
చికెన్‌ను శుభ్రంగా కడిగి నీరులేకుండా మిక్సీలో వేసుకుని కైమాలా గ్రైండు చేసుకోవాలి. దాన్లో పైన చెప్పిన పదార్థాలన్నీ వేసుకుని బాగా కలపాలి. ఈ ముద్దను చిన్న చిన్న ఉండల్లా తయారుచేసి ఆవిరిపైన బాగా ఉడికించాలి. ఈ చికెన్ బాల్స్‌ని వేడివేడిగా సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.