చికెన్‌, కార్న్‌ కర్రీ

ABN , First Publish Date - 2018-07-21T17:39:34+05:30 IST

మద్రాసు కర్రీ పొడి- అరకప్పు, కొబ్బరిపాలు - సరిపడా, వెజిటబుల్‌ ఆయిల్‌ - అరకప్పు, ఉల్లిపాయలు...

చికెన్‌, కార్న్‌ కర్రీ

కావలసినవి
 
మద్రాసు కర్రీ పొడి- అరకప్పు, కొబ్బరిపాలు - సరిపడా, వెజిటబుల్‌ ఆయిల్‌ - అరకప్పు, ఉల్లిపాయలు - మూడు (పెద్దవి, ముక్కలుగా చేసి), వెల్లుల్లిపాయలు - నాలుగు (సన్నగా తరిగి). అల్లం - చిన్నది (సన్నటి ముక్కలుగా తరిగి), ఉల్లిపాయ - ఒకటి (సన్నటి ముక్కలుగా చేసి), స్కిన్‌లెస్‌ చికెన్‌ బ్రెస్స్ట్‌ - రెండు (పెద్దముక్కలు), ఉప్పు - రుచికి సరిపడా, చక్కెర - రెండు స్పూను (పొడిలా చేసి), మొక్కజొన్నగింజలు- రెండు కప్పులు, అన్నం - కొద్దిగా.
 
తయారీవిధానం
చిన్న బౌల్‌ తీసుకుని అందులో పావుకప్పు కొబ్బరిపాలు, మద్రాసు కర్రీపొడి వేసి పేస్టులా చేయాలి. పెద్ద పాన్‌ తీసుకుని అందులో వెజిటబుల్‌ ఆయిల్‌ వేడిచేసి చిన్న సైజు ఉల్లిపాయలు (ముక్కలుగా), అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకూ వేగించాలి. ఇందులో తయారుచేసిపెట్టుకున్న కర్రీ పేస్టును కలపాలి. తర్వాత మంట తగ్గించి అన్ని పదార్థాలు బాగా కలిసేలా గరిటెతో కలియబెట్టాలి. కర్రీ వేడెక్కి, సువాసనలు రావడం కోసం పదిహేను నిమిషాల పాటు కర్రీని ఉడికించాలి.. మధ్య మధ్యలో కర్రీని కలపడం మరవొద్దు. తర్వాత చికెన్‌, టోస్‌ అందులో వేసి కర్రీలో కలిసిపోయేలా కలపాలి. మిగిలిన కొబ్బరిపాలు, చక్కెరలను కూడా ఇందులో కలిపి మీడియం మంటపై ఇరవై నిమిషాలపాటు ఉడకనివ్వాలి. మధ్యమధ్యలో ఈ మిశ్రమాన్ని కలుపుతుండాలి. దాంట్లో తాజా మొక్కజొన్నగింజలు వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. అవసరమైతే కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు. దీన్ని వేడిగా తింటే బాగుంటుంది. లేదా కర్రీ చల్లారాక సీల్డ్‌ కంటైనర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే నాలుగురోజులు నిల్వ ఉంటుంది.

Updated Date - 2018-07-21T17:39:34+05:30 IST