Abn logo

చేపల ఇగురు

v id="pastingspan1">కావలసినవి
 
చేపలు - అరకేజీ, ఉల్లిపాయలు - నాలుగు, పచ్చిమిర్చి - నాలుగు, కారం - రెండు టీస్పూన్లు, జీలకర్ర పొడి -టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, పసుపు - టీస్పూన్‌, టొమాటో - ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్టు - టీస్పూన్‌, కొత్తిమీర - కట్ట, నూనె, ఉప్పు - తగినంత.
 
తయారీవిధానం
 
ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి కొద్దిగా కారం, పసుపు, ఉప్పు వేసి కలియబెట్టి, అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక పాన్‌ తీసుకొని నూనే వేసి కాస్త వేడి అయ్యాక చేప ముక్కలు వేసుకొని కాసేపు వేగించి పక్కన పెట్టుకోవాలి. మరొకపాత్రలో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి మరికాసేపు వేగించాలి. కారం, జీలకర్రపొడి, ధనియాల పొడి వేసి కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, టొమాటో ముక్కలు, తగినంత ఉప్పు వేసి మరి కాసేపు వేగించాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. తరువాత వేగించి పెట్టుకున్న చేప ముక్కలు వేసి మరి కాసేపు ఉడికించాలి. కొత్తిమీర వేసుకుని వేడి వేడిగా తింటే చేపల ఇగురు టేస్ట్‌ సూపర్బ్‌గా ఉంటుంది.

డెంగ్యూతో మహిళ మృతిల్యాబ్‌ టెక్నీషియన్ల ఇష్టారాజ్యంస్కీమ్‌వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ధర్నావరివద్దు కరోనా మహమ్మారి అడ్డుకట్టకు వేగంగా వ్యాక్సినేషన్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే ఆత్రం సక్కుకళాశాలల్లో ఘనంగా ఎన్‌ఎస్‌ఎస్‌ దినోత్సవంతండ్రి మందలించాడని బాలుడి ఆత్మహత్యపరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
Advertisement