వెన్న మురుకులు

ABN , First Publish Date - 2019-08-24T17:23:33+05:30 IST

బియ్యప్పిండి - అరకప్పు, సెనగపిండి - పావు కప్పు, పుట్నాల పప్పు - పావుకప్పు, జీలకర్ర - అరటీస్పూన్‌, వెన్న - రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - తగినంత, నూనె - డీప్‌

వెన్న మురుకులు

కావలసినవి
 
బియ్యప్పిండి - అరకప్పు, సెనగపిండి - పావు కప్పు, పుట్నాల పప్పు - పావుకప్పు, జీలకర్ర - అరటీస్పూన్‌, వెన్న - రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - తగినంత, నూనె - డీప్‌ ఫ్రైకు సరిపడా, ఇంగువ - చిటికెడు.
 
తయారీవిధానం
 
పుట్నాల పప్పును మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఒక పాత్రలో బియ్యప్పిండి, సెనగపిండి, పుట్నాల పొడి, జీలకర్ర, ఇంగువ, ఉప్పు వేసి బాగా కలపాలి. వెన్న వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసి వేడి అయ్యాక మిశ్రమాన్ని మురుకులు ఒత్తే గిన్నెలో పెట్టి ఒత్తుకోవాలి. గోధుమ రంగులో వచ్చే వరకు వేగించుకుంటూ తీసుకోవాలి. వెన్న మురుకులను గాలి తగలకుండా గిన్నెలో ఉంచితే పది రోజుల వరకు పాడవ్వకుండా ఉంటాయి. కరకరలాడే వీటిని పిల్లలు ఇష్టంగా తింటారు.

Updated Date - 2019-08-24T17:23:33+05:30 IST