Abn logo

గుమ్మడి హల్వా

కావ

లసిన పదార్థాలు: పక్వానికి వచ్చిన గుమ్మడి పండు -1, జీడిపప్పు, కిస్‌మిస్‌ గుప్పెడేసి, పంచదార, బెల్లంపొడి - అరకేజీ చొప్పున, బియ్యంపిండి - 100 గ్రాములు, యాలకులు - 4, గసగసాలు - 1 స్పూను, తగినంత నెయ్యి.
తయారుచేసే విధానం
గుమ్మడి పండుని శుభ్రం చేసి పెద్ద ముక్కలుగా కోసి కుక్కర్లో కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఉడికిన ముక్కల్ని చెక్కుతీసి, గుజ్జుని మాత్రం చిదిమి ఉంచుకోవాలి. స్టవ్‌మీద బాండీ ఉంచి నెయ్యి వేసి అందులో జీడిపప్పు, కిస్‌మిస్‌, గసాలు వేసి వేగించి, గుమ్మడి ముద్ద కూడా వేసి బాగా వేగించాలి. తర్వాత బెల్లం, పంచదారను కూడా వేసి మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ బాగా ఉడకనివ్వాలి. కొంచెం ముదురుపాకం రాగానే, యాలకుల పొడి వేసి, దించి నెయ్యి రాసిన పళ్లెంలో పోసి సమంగా చేయాలి. నెయ్యి పైకి తేలిన గుమ్మడి హల్వా నెలరోజుల వరకూ నిల్వ ఉంటుంది.

అమాత్యా.. మాస్కులు మరిచితిరా?!వంద శాతం వ్యాక్సినేషన్‌కు కృషిఅభివృద్ధి పనులపై పెత్తనంపాతాళంలో విషం..!వట్టివాగు ప్రాజెక్టు కుడికాలువ గండి పూడ్చేదెన్నడు?ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలిపెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని ధర్నాకేజీబీవీలో మెనూపై గ్రంథాలయ చైర్మన్‌ ఆగ్రహంక్రాస్‌ కంట్రీ పోటీలకు ఎంపికైన క్రీడాకారులుయాసంగిలో పప్పుదినుసు పంటలు వేయాలి
Advertisement