బూందీ పాయసం

ABN , First Publish Date - 2015-09-26T17:04:14+05:30 IST

కావలసిన పదార్థాలు: రెడీమేడ్‌ స్వీట్‌ బూంది - 3/4 కప్పులు, కుంకుమ పువ్వు - చిటికెడు, చిక్కటి పాలు

బూందీ పాయసం

కావలసిన పదార్థాలు: రెడీమేడ్‌ స్వీట్‌ బూంది - 3/4 కప్పులు, కుంకుమ పువ్వు - చిటికెడు, చిక్కటి పాలు - 3 కప్పులు, బిరియాని ఆకు - 3, చక్కెర - 5 టే.స్పూన్లు, రోజ్‌ వాటర్‌ - అర టీస్పూను, యాలకుల పొడి - 1 టీస్పూను, పిస్తా పప్పు - 1 టే.స్పూను.
తయారీ విధానం: టీస్పూను పాలలో కుంకుమ పువ్వు వేసి కలిపి పక్కనుంచాలి. పాలలో బిరియాని ఆకులు వేసి పాలు సగమయ్యేవరకూ చిన్న మంట మీద 20 నిమిషాలపాటు తెర్లనివ్వాలి. తర్వాత బిరియాని ఆకులు తీసేయాలి. తర్వాత చక్కెర వేసి మీడియం ఫ్లేమ్‌ మీద ఒక నిమిషంపాటు కలపాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత బూంది, కుంకుమ పువ్వు, రోజ్‌ వాటర్‌, యాలకుల పొడి, బాదం పప్పు వేసి కలపాలి. రెండు గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచి సర్వ్‌ చేయాలి.

Updated Date - 2015-09-26T17:04:14+05:30 IST