జామ తెప్లా

ABN , First Publish Date - 2018-01-06T23:13:48+05:30 IST

గోధుమపిండి- ఒక కప్పు, జామకాయ తురుము- ముప్పావు కప్పు, ధనియాలపొడి- రెండు టీస్పూన్లు, పసుపు, కారం..

జామ తెప్లా

కావలసినవి
 
గోధుమపిండి- ఒక కప్పు, జామకాయ తురుము- ముప్పావు కప్పు, ధనియాలపొడి- రెండు టీస్పూన్లు, పసుపు, కారం- ఒక్కోటి ఒక్కో టీస్పూను చొప్పున, ఉప్పు-తగినంత, నూనె, కొత్తిమీర తరుగు- ఒక్కోటి ఒక్కో టేబుల్‌స్పూను చొప్పున, నిమ్మరసం- ఒక టీస్పూను, చక్కెర (మెత్తటి పొడిలా చేసి)- రెండు టీస్పూన్లు, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు - ఒక్కో టీస్పూను చొప్పున, మెంతి ఆకుల తరుగు - రెండు టేబుల్‌స్పూన్లు, నూనె-తగినంత.
 
తయారీ విధానం
 
లోతైన గిన్నెలో పైన చెప్పిన పదార్థాలన్నింటినీ వేసి మెత్తటి పిండిముద్దలా చేసి పది నిమిషాలు నానబెట్టాలి. తరువాత పిండిని పెద్ద ఉండలుగా చేసి పరాటా లేదా చపాతీల్లా వత్తాలి. చపాతీల్లా వత్తిన ఒక్కో తెప్లాను వేడి తవా మీద వేయాలి. చుట్టూరా నూనె చల్లి బంగారు రంగు వచ్చే వరకు రెండు వైపులా కాల్చాలి. వేడివేడిగా తింటే టేస్టీగా ఉంటాయి.

Updated Date - 2018-01-06T23:13:48+05:30 IST