గుమ్మడికాయ కూటు

ABN , First Publish Date - 2019-12-14T16:56:53+05:30 IST

గుమ్మడికాయ ముక్కలు - అరకప్పు, పెసరపప్పు - పావుకప్పు, నూనె - సరిపడా, ఆవాలు - పావు టీస్పూన్‌, జీలకర్ర - అర టీస్పూన్‌, కరివేపాకు - కొద్దిగా, ఎండుమిర్చి - రెండు

గుమ్మడికాయ కూటు

కావలసిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు - అరకప్పు, పెసరపప్పు - పావుకప్పు, నూనె - సరిపడా, ఆవాలు - పావు టీస్పూన్‌, జీలకర్ర - అర టీస్పూన్‌, కరివేపాకు - కొద్దిగా, ఎండుమిర్చి - రెండు, సెనగపప్పు - అర టీస్పూన్‌, మినప్పప్పు - అర టీస్పూన్‌, ఉల్లిపాయలు - రెండు, అల్లం - చిన్నముక్క, టొమాటో - రెండు, పసుపు - చిటికెడు, కారం - ఒక టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర - ఒక కట్ట.
 
తయారీ విధానం: గుమ్మడికాయ పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. కుక్కర్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేగించాలి. తరువాత సెనగపప్పు, మినప్పప్పు వేసి మరికాసేపు వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు బాగా వేగాక టొమాటో ముక్కలు వేయాలి. మరికాసేపు చిన్నమంటపై వేగిన తరువాత గుమ్మడికాయ ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు పెసరపప్పు, పసుపు, ధనియాలపొడి, కారం, తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి కుక్కర్‌ మూత పెట్టాలి. నాలుగు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. ఆవిరి పోయాక మూత తీసి కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని తింటే ‘వావ్‌’ అనాల్సిందే.

Updated Date - 2019-12-14T16:56:53+05:30 IST