Abn logo

టొమాటో సూప్‌

v id="pastingspan1">కావలసినవి
 
టొమాటోలు - అరకేజీ, అల్లం - చిన్నముక్క, ఆలివ్‌ ఆయిల్‌ - రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయ - ఒకటి, బిర్యానీ ఆకు - ఒకటి, టొమాటో ప్యూరీ - అరకప్పు, తులసి ఆకులు - కొన్ని, మిరియాలు - ఒక టీస్పూన్‌, బ్రెడ్‌ ముక్క - ఒకటి, వెల్లుల్లి రెబ్బలు - మూడు, ఉప్పు - తగినంత.
 
తయారీవిధానం
 
ముందుగా ఉల్లిపాయలు, టొమాటోలు కట్‌ చేసుకోవాలి. అల్లంను దంచుకోవాలి. ఒక చిన్నపాత్రలో అల్లం, కొద్దిగా ఉప్పు, ఆలివ్‌ ఆయిల్‌ వేసి ఓవెన్‌లో వేడి చేయాలి. మరొక పాత్రలో ఆలివ్‌ ఆయిల్‌ వేసి ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు, బిర్యానీ ఆకు వేసి వేగించాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు వేసి, కొన్ని నీళ్లు పోసి ఉడికించాలి. కాసేపయ్యాక టొమాటో ప్యూరీ, తులసి ఆకులు, మిరియాల పొడి వేయాలి. ఓవెన్‌లో వేడి చేసుకున్న అల్లం వేయాలి. టొమాటోలు ఉడికే వరకు ఉంచి స్టవ్‌ నుంచి దించుకోవాలి. చల్లారిన తరువాత మిక్సీ పట్టుకోవాలి. తులసి ఆకులతో గార్నిష్‌ చేస్తే నోరూరించే టొమాటో సూప్‌ రెడీ.

జిల్లా కేంద్రంలో రూ. 1.5 కోట్లతో ఈ-లైబ్రరీ నిర్మాణంఆపద్బంఽధు చెక్కులు అందజేసిన మంత్రిగడ్డెన్న ప్రాజెక్టు నుంచి 4,500 క్యూసెక్కుల నీటివిడుదలబాబా ఆలయంలో ప్రత్యేకపూజలుపంటనష్టం .. రైతులకు కష్టంఅన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషిప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీవేగవంతంగా వ్యాక్సినేషన్‌డిగ్రీ కళాశాలను సందర్శించిన న్యాక్‌ బృందం పులుల గణన పకడ్బందీగా చేపట్టాలి
Advertisement