శెనగపప్పు పాయసం

ABN , First Publish Date - 2017-08-12T18:47:05+05:30 IST

పచ్చి శెనగపప్పు, పాలు - ఒక్కోటి ముప్పావు కప్పు చొప్పున, బెల్లం పొడి -ఒక కప్పు, ఎండుకొబ్బరి ముక్కలు - ఒక టేబుల్‌ స్పూన్‌,

శెనగపప్పు పాయసం

కావలసినవి
 
పచ్చి శెనగపప్పు, పాలు - ఒక్కోటి ముప్పావు కప్పు చొప్పున, బెల్లం పొడి -ఒక కప్పు, ఎండుకొబ్బరి ముక్కలు - ఒక టేబుల్‌ స్పూన్‌, యాలకుల రెబ్బలు - నాలుగు (పొడి చేసి), జీడిపప్పులు, ఎండుద్రాక్షలు -అవసరమైనన్ని, నెయ్యి - రెండు టేబుల్‌ స్పూన్లు.
 
తయారీ విధానం
 
పాన్‌లో ఒక టీస్పూన్‌ నూనె వేడి చేసి శెనగపప్పుని మూడు నిమిషాలు వేగించాలి.
తరువాత వేగించిన పప్పులో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి ప్రెషర్‌కుక్కర్‌లో పెట్టి నాలుగు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. స్టీమ్‌ వచ్చాక పప్పుని మరీ మెత్తగా కాకుండా మెదపాలి. ఒక గిన్నెలో బెల్లం వేసి, పావు కప్పు నీళ్లు పోసి బెల్లం కరిగే వరకు వేడిచేయాలి. పప్పు, యాలకుల పొడి వేసి ఐదు నిమిషాలు లేదా మిశ్రమం చిక్కబడేవరకు ఉంచాలి. తరువాత స్టవ్‌ ఆపేసి పాలు పోసి బాగా
కలపాలి. మిగిలిన నెయ్యిని వేడిచేసి అందులో కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, ఎండు 
ద్రాక్షలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. దీన్ని పాయసం 
మీద పోసి కలపాలి.

Updated Date - 2017-08-12T18:47:05+05:30 IST