Abn logo

మసాలా కీరా

v id="pastingspan1">పుష్కలంగా నీరుండే కీరా దోసకాయ వేసవిలో మీకు మంచి నేస్తం. డీహైడ్రేట్‌ అయిన శరీరానికి సత్వరమే నీటిని అందిస్తుంది. వంట్లోని వ్యర్థాలను బయటికి పంపేస్తుంది.
 
కావలసినవి
కీరదోసకాయలు - రెండు, పచ్చిమిర్చి - ఒకటి, కరివేపాకులు - కొన్ని, చింతపండు - కొద్దిగా, టొమాటో - (తరిగి) చిన్న ముక్క, కొబ్బరి తురుము - అర టేబుల్‌ స్పూన్‌, కొత్తిమీర తరుగు - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - అర టీస్పూన్‌, కారం - అర టీస్పూన్‌, పసుపు - పావు టీస్పూన్‌, ఇంగువ - కొద్దిగా, ఆవాలు, జీలకర్ర - ఒక్కోటి పావు టీస్పూన్‌ చొప్పున, గోధుమపిండి - పావు టీస్పూన్‌, నూనె - ఒక టేబుల్‌ స్పూన్‌, ఉప్పు - సరిపడా.
 
 
తయారీవిధానం
డ్రై మసాలా పొడిని అర కప్పు నీళ్లలో కలిపి పక్కన పెట్టాలి.
కీరాని మరీ సన్నగా, లావుగా కాకుండా ఓ మాదిరి సైజులో తరగాలి.
మందపాటి పాన్‌లో నూనె వేడిచేసి తాలింపు గింజలు, ఇంగువ, కరివేపాకులు, పచ్చిమిర్చి వేసి చిటపటమనేవరకు వేగించాలి.
తరువాత మసాలా పేస్ట్‌, చింతపండు వేసి ఒక నిమిషం పాటు వేగించాలి.
టొమాటో, కీరదోసకాయల తరుగు, కొబ్బరి తురుము వేసి మూతపెట్టి సన్నటి మంట మీద ఉంచాలి.
కీర దోసకాయ ముక్కలు ఉడకాలి కాని పట్టుకుంటే గట్టిగా ఉండాలి. అవి అలా ఉన్నప్పుడు ఉప్పు వేయాలి. గోధుమపిండి చల్లి కలపాలి.
గోధుమపిండి వేశాక కొంచెంసేపు ఉడికించి వడ్డించే గిన్నెలోకి వంపేయాలి.
కొత్తిమీర తరుగుతో అలంకరించి వేడివేడి పుల్కాలతో లేదా పూరీ, అన్నం దేనితో తిన్నా టేస్టీగా ఉంటుంది.

దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలివైభవంగా లక్ష దీపోత్సవంకోతుల నియంత్రణేది ? ఒమైక్రాన్‌ రాకుండా జాగ్రత్త వహించాలివ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలివాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి శాంతి భద్రతల పరిరక్షణకే నిర్బంధ తనిఖీలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న పాలకులు ఫీడింగ్‌ చాంబర్‌కు జాతీయస్థాయి అవార్డు దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి
Advertisement