ఉసిరి మురబ్బా

ABN , First Publish Date - 2015-09-02T22:55:23+05:30 IST

కావలసిన పదార్థాలు: (పెద్ద) ఉసరికాయల తురుము - 1 కప్పు, నీరు - పావు కప్పు, పంచదార

ఉసిరి మురబ్బా

కావలసిన పదార్థాలు: (పెద్ద) ఉసరికాయల తురుము - 1 కప్పు, నీరు - పావు కప్పు, పంచదార - ఒకటింబావు కప్పు, యాలకులపొడి - అర టీ స్పూను, దాల్చినచెక్క - అంగుళం ముక్క.
తయారుచేసే విధానం: కడాయిలో ఉసిరి తురుము, నీరు, పంచదార వేసి ఉడికించాలి. పంచదార కరిగి, ఉసిరి తురుముతో కలిసి ఎరుపు రంగులోకి మారిన తర్వాత యాలకుల పొడి, దాల్చినచెక్క వేసి మరో మూడు నిమిషాలు ఉంచి దించేయాలి. చిక్కబడ్డానికి 15 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు దాల్చినచెక్క తీసేయాలి. ఈ మురబ్బా పరగడపునే అర స్పూను చొప్పున రోజూ తింటే ఆరోగ్యానికి మంచిది కూడా. మూత ఉన్న సీసాలో (ఫ్రిజ్‌లో) ఉంచితే నెలరోజులు వాడుకోవచ్చు.

Updated Date - 2015-09-02T22:55:23+05:30 IST