కీమా టిక్కీ

ABN , First Publish Date - 2018-12-15T21:19:25+05:30 IST

ఉడికించిన మటన్‌ కీమా - పావు కేజీ, ఉల్లి తరుగు - అరకప్పు, పచ్చిమిర్చి తరుగు - ఒక టీ స్పూను...

కీమా టిక్కీ

కావలసిన పదార్థాలు
 
ఉడికించిన మటన్‌ కీమా - పావు కేజీ, ఉల్లి తరుగు - అరకప్పు, పచ్చిమిర్చి తరుగు - ఒక టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, పసుపు - పావు టీ స్పూను, కారం - అర టీ స్పూను, ధనియాల పొడి - ఒక టీ స్పూను, గరం మసాలా పొడి - పావు టీ స్పూను, బ్రెడ్‌ ముక్కలు - ఒక కప్పు, గుడ్డు - ఒకటి, బ్రెడ్‌ పొడి - అరకప్పు, నూనె - వేగించడానికి సరిపడా.
 
తయారుచేసే విధానం
 
ఒక పాత్రలో కీమా, ఉల్లి తరుగు, మిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం, ధనియా పొడి, గరం మసాల వేసి బాగా కలపాలి. తర్వాత చిదిమిన బ్రెడ్‌ వేసి మరోసారి కలిపి ముద్దగా చేసుకుని కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇప్పుడు ముద్దను సమభాగాలుగా చేసుకుని అరచేతిలో టిక్కీగా ఒత్తి గుడ్డు సొనలో ముంచి, బ్రెడ్‌ పొడిలో అన్నివైపులా దొర్లించాలి. తర్వాత పెనంపై నూనెలో రెండు వైపులా దోరగా వేగించాలి. ఇవి టమోటా కెచప్‌తో తింటే బాగుంటాయి.

Updated Date - 2018-12-15T21:19:25+05:30 IST