Advertisement
Advertisement
Abn logo
Advertisement

అలసంద సాంబారు

కావలసిన పదార్థాలు: ఉడికించిన అలసందలు - ఒక కప్పు, టమాటాలు - రెండు, పచ్చి మిర్చి - నాలుగు, పచ్చి కొబ్బరి తురుము - రెండు టేబుల్‌ స్పూన్లు, అల్లం ముక్కలు - ఒక టీస్పూను, ఎండుమిరపకాయలు - నాలుగు, తాలింపు దినుసులు - ఒక టీస్పూను, ఇంగువ - చిటికెడు, పసుపు - చిటికెడు, కారం - ఒక టీస్పూను, ఉప్పు - తగినంత, చింతపండు - చిన్న నిమ్మకాయంత, కొత్తిమీర - కొద్దిగా, సాంబారు పౌడరు - అర టీస్పూను, కరివేపాకు - రెండు రెబ్బలు.
తయారుచేసే విధానం: ముందుగా కడాయిలో నూనె పోసి కాగాక పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, వేగాక గ్రైండ్‌ చేసుకున్న అలసందల ముద్దను వేసి కలిపి, అందులోనే పలచగా చింతపండు రసం, టమాటా ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, సాంబారు పౌడరు, పచ్చి కొబ్బరి తురుము వేసి అది మరుగుతుండగానే మరో కడాయిలో నూనె పోసి కాగాక ఇంగువ, అల్లం ముక్కలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు వేసి వేగాక మరుగుతున్న సాంబారులో కలిపి కాసేపు ఉంచి, కొత్తిమీర చల్లి దించేయాలి.

ఫీవర్‌సర్వేను పరిశీలించిన కలెక్టర్‌ పకడ్బందీగా ఆరోగ్య సర్వే : కలెక్టర్‌ఆదివాసీలను మభ్యపెడుతున్న ప్రభుత్వం చైర్మన్‌ గురిపై గురికుంరం భీం జిల్లా బీజేపీలో ముసలం ఫీవర్‌ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి అభివృద్ధి పనులు త్వరిగతిన పూర్తి చేయాలిఆదివాసీలు దేవతలకు పూజలుఫిబ్రవరి 20న జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడి ఎన్నికకాగజ్‌నగర్‌లో దుర్గంధంగా ఎస్‌బీఐ ఏటీఎం
Advertisement