చికెన్‌ పకోడి

ABN , First Publish Date - 2015-08-30T18:39:21+05:30 IST

కావలసిన పదార్థాలు: బోన్‌ లెస్‌ చికెన్‌ (చిన్నముక్కలు) - అరకేజి, పచ్చిమిర్చి - 4, జీలకర్ర - 1 స్పూను

చికెన్‌ పకోడి

కావలసిన పదార్థాలు: బోన్‌ లెస్‌ చికెన్‌ (చిన్నముక్కలు) - అరకేజి, పచ్చిమిర్చి - 4, జీలకర్ర - 1 స్పూను, అల్లం - అంగుళం ముక్క, గరం మసాల - అర టీ స్పూను, నిమ్మరసం - 1 టేబుల్‌ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, శనగపిండి - 200 గ్రా., బియ్యప్పిండి - 1 టేబుల్‌ స్పూను, దనియాలపొడి - 1 టీ స్పూను, కారం - అర టీ స్పూను, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, గరం మసాల, నిమ్మరసం కలిపి మెత్తని ముద్దలా నూరుకోవాలి. ఈ ముద్దని చికెన్‌ ముక్కలకి పట్టించి ఫ్రిజ్‌లో అరగంట ఉంచాలి. ఒక పాత్రలో శనగపిండి, బియ్యప్పిండి, దనియాలపొడి, కారం, ఉప్పు వేసి తగినంత నీటితో జారుగా కలుపుకోవాలి. చికెన్‌ ముక్కల్ని ఈ శనగపిండిలో ముంచి నూనెలో (చికెన్‌ ముక్కలు ఉడికేలా చిన్న మంటపై) దోరగా వేగించుకోవాలి. వేడివేడిగా టమోటా సాస్‌తో తింటే చాలా బాగుంటాయివి.

Updated Date - 2015-08-30T18:39:21+05:30 IST