Abn logo

క్యారెట్‌ కుక్కీస్‌

కావలసిన పదార్థాలు: క్యారెట్‌, పచ్చికొబ్బరి తురుము - అర కప్పు చొప్పున, గుడ్డు - 1, బాదం పొడి - అర కప్పు, కిస్‌మిస్‌, వాల్‌నట్స్‌ తరుగు, తేనె, నూనె - పావు కప్పు చొప్పున, బేకింగ్‌ పౌడర్‌ - 1 టీ స్పూను, వెనిలా ఎసెన్స్‌ - 1 టీ స్పూను, ఉప్పు - చిటికెడు, జాజికాయ, దాల్చినచెక్క పొడి - పావు టీ స్పూను చొప్పున.
తయారుచేసే విధానం: ఒవెన్‌ 350 (ఫా.) డిగ్రీలో ప్రీ హీట్‌ చేసి పెట్టుకోవాలి. ఒక పాత్రలో గుడ్డు గిలకొట్టి అందులో క్యారెట్‌, కొబ్బరి తురుము, బాదంపొడి, కిస్‌మిస్‌, వాల్‌నట్స్‌, తేనె, నూనె, బేకింగ్‌ పౌడర్‌, వెనిలా ఎసెన్స్‌, ఉప్పు, జాజికాయ, దాల్చినచెక్క పొడులు వేసి బాగా కలిపి ముద్దలా చెయ్యాలి. దీన్ని 18 భాగాలుగా చేసి చేత్తో దళసరి వడల్లా వత్తి ఒవెన్‌లో 15 నుండి 17 నిమిషాల పాటు ఉంచాలి. పిల్లలు బాగా ఇష్టపడే ఈ కుక్కీస్‌ మంచి బలమైన ఆహారం కూడా.

రైతు వేదిక నిర్మాణాలను వేగంగా పూర్తిచేయాలిసివిల్స్‌ ఫలితాల్లో సత్తా చాటిన సంకీర్త్‌మంచిర్యాల ఎన్నిక నేడుబెల్లంపల్లి మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవంవెళ్ళగొడుతున్నారు...కార్మికుల సంక్షేమం పట్టని ఎంసీసీ యాజమాన్యంకరోనా జోరు....ప్రజలు బేజారుఅక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ పట్టివేత ఇంటింటా రాఖీ పండుగ సందడిబీజేపీ యువమోర్చా జిల్లా కార్యవర్గం లెదర్‌పార్క్‌పై చిగురిస్తున్న ఆశలు
Advertisement
d_article_rhs_ad_1
Advertisement