భయాందోళనలో ఆదివాసీలు

ABN , First Publish Date - 2021-10-13T06:19:32+05:30 IST

వారం రోజుల్లో సిర్పూర్‌(యూ) మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ముగ్గురు ఆదివాసీలపై ఎలుగుబంటి దాడి చేసి గాయపరిచింది. భూర్నూర్‌ గ్రామానికి చెందిన కనక చిన్ను ఎడ్ల కోసం గ్రామ పొలిమేరలో గాలిస్తుండగా ఎలుగుబంటి దాడిచేసి గాయపరిచింది.

భయాందోళనలో ఆదివాసీలు
ఎలుగుబంటిదాడిలో గాయపడిన కనక చిన్ను(ఫైల్‌)

వారం రోజుల్లో ముగ్గురిపై ఎలుగుబంటి దాడి 

అటవీ ప్రాంతానికి వెళ్లాలంటే భయపడుతున్న గ్రామస్థులు

సిర్పూర్‌(యూ), అక్టోబరు 12: వారం రోజుల్లో సిర్పూర్‌(యూ) మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ముగ్గురు ఆదివాసీలపై ఎలుగుబంటి దాడి చేసి గాయపరిచింది. భూర్నూర్‌ గ్రామానికి చెందిన కనక చిన్ను ఎడ్ల కోసం గ్రామ పొలిమేరలో గాలిస్తుండగా ఎలుగుబంటి దాడిచేసి గాయపరిచింది. ప్రస్తుతం చిన్ను ఆది లాబాద్‌ రిమ్స్‌లో చికిత్సపొందుతున్నాడు. అదేవిధంగా శెట్టి హడ్పు నూర్‌ గ్రామపరిధిలోని తాటిగూడ గ్రామానికి చెందిన బాదిరావు, ఆత్రం గోవిందరావుపై ఎలుగుబంటి దాడిచేసింది. వారం రోజుల్లోపే ముగ్గురిపై ఎలుగుబంటి దాడిచేయడంతో ఆదివాసీలు భయాందో ళన చెందుతున్నారు. ముఖ్యంగా పశువుల కాపరులు పశువులను అటవీప్రాంతానికి తీసుకెళ్లడానికి భయపడుతున్నారు. ఎలుగుబంటి దాడికి గురై బాధితులకు అటవీశాఖ నష్ట పరిహారం అందించి ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఆయాగ్రామాల ప్రజలు కోరు తున్నారు. 

నష్టపరిహారం అందించాలి..

- కుడ్మెత విశ్వనాథ్‌రావు, ఆదివాసీ విద్యార్థిసంఘం నాయకుడు

ఎలుగుబంటి దాడిలో గాయపడిన బాధితులకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలి. అడవి జంతువులపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రజలు అడవుల్లోకి ఒంటరిగా వెళ్లకుండా గుంపులుగా వెళ్లాలని అధికారులు తెలియజేయాలి.

ప్రభుత్వపరంగా ఆదుకుంటాం..

- శశిధర్‌బాబు, డిప్యూటీ రేంజ్‌ అధికారి 

ఎలుగుబంటి దాడిలో గాయపడిన బాధితులను తమశాఖ ఆదు కుంటుందని అటవీశాఖ అధికారి డీఆర్‌వో శశిధర్‌బాబు అన్నారు. ఎలుగుబంటి దాడిలో గాయపడిన వారి సమాచారాన్ని సేకరిస్తు న్నామన్నారు. దీనిపై అధికారులకు నివేదిక పంపిస్తామన్నారు.

Updated Date - 2021-10-13T06:19:32+05:30 IST