మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. ఫిర్యాదు!

ABN , First Publish Date - 2021-07-04T14:24:39+05:30 IST

యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన...

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. ఫిర్యాదు!

  • యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌లో.. 
  • సైబర్‌క్రైంలో న్యాయవాది ఫిర్యాదు

హైదరాబాద్‌ సిటీ : యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌ పంచ్‌ ప్రభాకర్‌పై చర్యలు తీసుకోవాలంటూ టోలీచౌకీకి చెందిన మహమ్మద్‌ ఇఫ్తెకారుద్దీన్‌ అనే న్యాయవాది సైబర్‌క్రైంలో ఫిర్యాదు చేశాడు. ఇండియాకు చెందిన పంచ్‌ ప్రభాకర్‌ యూఎస్‌ నుంచి యూట్యూబ్‌ చానెల్‌, ఫేస్‌బుక్‌ పేజీలను ఆపరేట్‌ చేస్తూ మంత్రిపై అసభ్య పదజాలాన్ని ప్రయోగిస్తున్నట్లు న్యాయవాది సీడీల రూపంలో ఆధారాలు సమర్పించారు. కులం, గౌరవాన్ని కించపరిచే భాషలో మాట్లాడుతూ మంత్రి పరువుకు నష్టం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన సైబర్‌క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-07-04T14:24:39+05:30 IST