Advertisement
Advertisement
Abn logo
Advertisement

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి: ఏఐకేఎంఎస్‌

నాగారం మండలం ఢీకొత్తపల్లి గ్రామంలో ఐకేపీ కేంద్రం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న ఏఐకేఎంఎస్‌ నాయకులు

నాగారం, డిసెంబరు 8: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్‌) రాష్ట్ర నాయకుడు మండారి డేవిడ్‌కుమార్‌  కోరారు.  మండలంలోని  ఢీకొత్తపల్లి ఐకేపీ సెంటర్‌ ఎదుట సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిరసన తెలిపి మాట్లాడారు.  ఐకేపీ సెంటర్లలో రైతులకు కనీస సౌకర్యాలు లేవన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ రైతుల  జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని విమర్శించారు రానున్న రబీ సీజన్‌కు కోనుగోలు కేంద్రాలను ఎత్తివేసే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. నూతన విద్యుత్‌ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంట నాగయ్య, కృష్ణ, శంకర్‌, వెంకన్న, సయ్యద్‌, లింగయ్య,ఽ ధనుంజయ్‌, సాగర్‌, ప్రవీణ్‌ పాల్గొన్నారు. 

తూకంలో రైతులను మోసం చేస్తే చర్యలు: తహసీల్దార్‌

మద్దిరాల, డిసెంబరు 8: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు, హమాలీలు తూకంలో రైతులను మోసం చేస్తే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ మన్నన్‌ హెచ్చరించారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు.  ఆయన వెంట ఆర్‌ఐ ఎండీ మగ్దూంబాబా, సీనియర్‌ అసిస్టెంట్‌ రామారావు, రైతులు ఉన్నారు.


Advertisement
Advertisement