నూతన ఏఎస్పీలుగా బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2021-03-02T04:50:15+05:30 IST

ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాలకు నూతన అదనపు ఎస్పీలుగా నియామకమైన అధికారులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు పోలీసు ముఖ్య కార్యాలయంలో ఎస్పీని ఎస్పీ విష్ణు ఎస్‌.వారియర్‌కలిసి పుష్పగుచ్ఛం అందించారు.

నూతన ఏఎస్పీలుగా బాధ్యతల స్వీకరణ

ఆదిలాబాద్‌టౌన్‌, మార్చి1: ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాలకు నూతన అదనపు ఎస్పీలుగా నియామకమైన అధికారులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు పోలీసు ముఖ్య కార్యాలయంలో ఎస్పీని ఎస్పీ విష్ణు ఎస్‌.వారియర్‌కలిసి పుష్పగుచ్ఛం అందించారు. శిక్షణలో భాగంగా ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాలకు ఇద్దరు ఐపీఎస్‌ అధికారులను రాష్ట్ర డీజీపీ కేటాయించినట్లు ఎస్పీ తెలిపారు. కాగా సరిహద్దు ప్రాంతాల కూంబింగ్‌ ఆపరేషన్‌ మరింత పటిష్ఠం కానున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లాకు సుపరిచితుడైన ఏఎస్పీ హర్షవర్ధన్‌ 2018 ఐపీఎస్‌ బ్యాచ్‌ అధికారి శిక్షణలో భాగంగా నేరడిగొండ పోలీసు స్టేషన్‌ ఇన్‌చార్జీగా బాధ్యతలు నిర్వహించారు. కాగా, నిర్మల్‌ జిల్లాకు 2017 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన కారేకిరణ్‌ ప్రభాకర్‌ను నియమించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు ఐపీఎస్‌ అధికారులు గ్రేహౌండ్‌ నుంచి జిల్లాకు వచ్చి రిపోర్టు చేశారు. 

Updated Date - 2021-03-02T04:50:15+05:30 IST