తప్పిన పెను ప్రమాదం

ABN , First Publish Date - 2021-05-19T06:19:13+05:30 IST

రసాయనం లోడ్‌తో ట్యాంకర్‌కు పెనుప్రమాదం తప్పింది.

తప్పిన పెను ప్రమాదం

బెంజ్‌ ఫ్లైఓవర్‌ దిగువన రక్షణ గోడను ఢీ కొట్టిన ట్యాంకర్‌

రెండు టైర్లు పేలడంతో నియంత్రించలేకపోయిన డ్రైవర్‌  

ట్యాంకర్‌లో రసాయనం

విజయవాడ, మే 18(ఆంధ్రజ్యోతి) : రసాయనం లోడ్‌తో ట్యాంకర్‌కు పెనుప్రమాదం తప్పింది. బెంజ్‌సర్కిల్‌ ఫ్లైఓవర్‌ దిగువన ఉన్న రక్షణ గోడను ఢీకొట్టుకుని ట్యాంకర్‌ ఆగిపోయి పెద్ద ప్రమాదం తప్పింది. ఏపీ39ఎక్స్‌ 4885 నంబర్‌ గల ట్యాంకర్‌ రసాయనం లోడుతో విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. ఈ ట్యాంకర్‌ మంగళవారం తెల్లవారుజామున విజయవాడకు చేరుకుంది. బెంజ్‌సర్కిల్‌ ఫ్లైఓవర్‌ దిగుతుండగా ట్యాంకర్‌ రెండు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. దీనితో ట్యాంకర్‌ను డ్రైవర్‌ నియంత్రించలేకపోయాడు. ట్యాంకర్‌ ఫ్లైఓవర్‌కు ఉన్న రక్షణగోడను ఢీకొట్టుని ముందుకు వెళ్లి ఆగిపోయింది. ట్యాంకర్‌ ఉన్న ఇతర టైర్లు విరిగిపోయాయి. రక్షణగోడ పూర్తిగా దెబ్బతిన్నది. దీనిపై పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. 


Updated Date - 2021-05-19T06:19:13+05:30 IST