Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఘోరం

ఆటోను అతివేగంగా ఢీకొట్టిన 

వైసీపీ నాయకుడి బొలెరో వాహనం

ఐదుగురు మృతి.. ముగ్గురి పరిస్థితి విషమం

ఒక కుటుంబంలో తండ్రీకూతురు దుర్మరణం.. 

మృత్యువుతో పోరాడుతున్న తల్లీకుమారులు..

మరో కుటుంబంలో తల్లి, కూతురు, మనవడు కన్నుమూత

రెండు కుటుంబాల్లో అంతులేని విషాదం

కేసు నమోదులో పోలీసుల ఏకపక్ష వైఖరికి 

నిరసనగా రోడ్డెక్కిన బంధువులు


రాయదుర్గం/గుమ్మఘట్ట, డిసెంబరు 6: 

అతివేగం ఐదుగురిని బలిగొంది. రెండు కుటుంబాల్లో అంతులేని శోకం నింపింది. గుమ్మఘట్ట మండలం గోనబావి క్రాస్‌ వద్ద సోమవారం బొలెరో వాహనం అతివేగంగా వెళ్తూ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టడంతో నలుగురు దుర్మరణం చెందారు. ఒకరు ఆస్పత్రిలో మరణించారు. మరో ముగ్గురు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.  ప్రమాదంలో బ్రహ్మసముద్రం మండలం వెస్ట్‌కోడిపల్లికి చెందిన శేఖర్‌ (30), అతడి కుమార్తె రష్మిత (6), ముప్పులకుంట గ్రామానికి చెందిన నాగమ్మ (70), గుమ్మఘట్ట మండలం పూలకుంటకి చెందిన మహేంద్ర (10), అతడి తల్లి లక్ష్మీదేవి (35) మరణించారు. ఆటోలో ఉన్న శేఖర్‌ భార్య రూప, కుమారుడు రాము, బొలెరో వాహనాన్ని నడుపుతున్న వైసీపీ నాయకుడు గోనబావి ప్రతా్‌పరెడ్డి (52) పరిస్థితి విషమంగా ఉంది.


దైవ దర్శనానికి వెళ్లొస్తూ..

బ్రహ్మసముద్రం మండలం వెస్ట్‌కోడిపల్లికి చెందిన శేఖర్‌ ఆ టో నడుపుతూ జీవనం సాగించేవాడు. ఇతడికి భార్య రూ ప, కుమార్తె రష్మిత, కుమారుడు రాము ఉన్నారు. నిరుపేద కుటుంబం. దైవ దర్శనానికి కర్ణాటకలోని ఉలిగికి కుటుంబ సభ్యులంతా బయల్దేరారు. మార్గమధ్యలో గుమ్మఘట్ట మం డలం వీరాపురం గ్రామంలో రూప తల్లిదండ్రుల ఇంటి వద్ద ఆటోను వదిలి, బస్సులో ఉలిగి వెళ్లారు. దైవ దర్శనానంత రం తిరుగు వచ్చి వీరాపురంలో ఆటోను తీసుకుని, స్వగ్రా మం వెస్ట్‌కోడిపల్లికి బయల్దేరారు. మార్గమధ్యలో పూలకుం ట గ్రామం వద్ద ముప్పులకుంటకు చెందిన నాగమ్మ, తన కూతురు లక్ష్మీదేవి, మనవడు మహేంద్రను తీసుకుని ఐదుకల్లు గ్రామంలో జరిగే ఆవుల జాతరకు వెళ్లేందుకు రోడ్డుపై నిల్చున్నారు. అంతలో శేఖర్‌ ఆటో అటుగా రావడంతో వేపులపర్తి క్రాస్‌ వరకు వెళ్దామని అందులో ముగ్గురు ఎక్కారు. కాసేపటికే గోనబావి క్రాస్‌లో అదే ఊరికి చెందిన వైసీపీ నా యకుడు బొలెరో వాహనాన్ని అతివేగంగా నడుపుతూ ఆటో ను ఢీకొట్టాడు. దీంతో ఆటో నుజ్జనుజ్జయింది. అందులోని వారు చెల్లాచెదురుగా పడిపోయారు. బొలెరో వాహనం కూడా పల్టీలు కొడుతూ రోడ్డుపక్కన పడిపోయింది. ఆటోలోని శేఖర్‌, అతడి కుమార్తె రష్మిత, నాగమ్మ, ఆమె మనవడు మహేంద్ర అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గా యపడిన లక్ష్మీదేవి, రూప, రాము, ప్రతా్‌పరెడ్డిని అటుగా వె ళ్తున్నవారు రాయదుర్గం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొం దుతూ నాగమ్మ కూతురు లక్ష్మీదేవి ప్రాణాలు విడిచింది.


తండ్రీకుమార్తెలు మృతి.. కోమాలో తల్లీకుమారులు

ప్రమాద స్థలంలో దృశ్యాలు కలచివేశాయి. శేఖర్‌ మృతదేహం ఒకచోట, అతడి కూతురు రష్మిత దేహం మరోచోట పడి ఉన్నాయి. శేఖర్‌ భార్య రూప కొన ఊపిరితో చెట్లలో పడి విలవిల్లాడుతుండగా.. ఆమె రెండేళ్ల కుమారుడు రాము స్పృహ కోల్పోయి, రక్తపుమడుగు లో పడి ఉండడం కలచివేసింది. రాము ఆస్పత్రిలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. శేఖ ర్‌, కూతురు రష్మితను మృత్యువు కబళించగా.. భార్య రూప, కుమారుడు రాము ఆస్పత్రిలో చావుతో పోరాడుతున్నారు. స్పృహలోలేని వీరికి తమవారిని కోల్పోయామనే విషయం కూడా తెలియదు.  


అమ్మా.. నువ్వు కావాలి...

ఆవుల దేవరను తిలకించేందుకు బయల్దేరిన లక్ష్మీదేవి కుటుం బం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. 70 ఏళ్ల తల్లి నాగమ్మను తన వద్దే పెట్టుకుని, చూసుకుంటున్న లక్ష్మీదేవి తనతోపాటు చావులో కూడా తీసుకెళ్లింది. పూలకుంట గ్రామానికి చెందిన లక్ష్మీదేవికి నలుగురు సంతానం. ముగ్గురు కుమార్తెలు హీరేహాళ్‌లోని జ్యోతిరావుపూలే పాఠశాలలో చదువుతున్నారు. అందరికంటే చిన్నవాడైన మహేంద్ర పూలకుంటలోనే 4వ తరగతి చదువుతూ తల్లి వద్దే ఉంటున్నాడు. బ్రహ్మసముద్రం మండలం ఐదుకల్లులో జరిగే ఆవులజాతరను చూద్దామని తల్లి నాగమ్మ.. కుమారుడు మహేంద్రను వెంటబెట్టుకుని బయల్దేరింది. ఆటో రూపంలో మృత్యువు వారిని కబళించింది. అమ్మమ్మ నాగమ్మ, అమ్మ లక్ష్మీదేవి, తమ్ముడు మహేంద్రను చూసి కుమార్తెలు అక్షయ, అఖిల, మౌనిక బోరున విలపించారు. అమ్మను గుర్తుచేసుకుంటూ ముగ్గురు కుమార్తెలు ‘అమ్మా.. నువ్వు కావాలి..’ అంటూ గుండెలవిసేలా రోదించడం అక్కడున్న వారందరినీ కలచివేసింది. కూలి పనులతో నెట్టుకొస్తున్న ఆ పేద కుటుంబంలో ప్రమాదం అంతులేని విషాదాన్ని నింపింది. భార్యను, బిడ్డను కోల్పోయిన లక్ష్మీదేవి భర్త ముక్కన్న.. కుమార్తెలను అక్కున చేర్చుకుని, వెక్కివెక్కి ఏడవడం అందరితో కన్నీరు పెట్టించింది.


ఆస్పత్రి ఆవరణలో ఆర్తనాదాలు

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు చనిపోవడంతో వారి కుటుంబికు లు, బంధువులు పెద్దఎత్తున రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. వారి ఆర్తనాదాలతో ఆస్పత్రి ఆవరణ కన్నీటిసంద్రమయింది. శేఖర్‌, అతడి కూతురు రష్మిక చనిపోవడం, అ తడి రెండేళ్ల కుమారుడు రాము కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న దృశ్యాలు హృదయవిదారకం. లక్ష్మీదేవి బంధువులు బో రున విలపించారు. విషయం తెలియగానే డీఎస్పీ ఆంథోనప్ప.. సీఐ సురే్‌షబాబు, ఎస్‌ఐ తిప్పయ్యనాయక్‌తో కలిసి ప్రమాద స్థలానికి చేరుకున్నారు. మోటారు వాహనాల తనిఖీ అధికారి నరసింహులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


పోలీసులతో బంధువుల వాగ్వాదం

ఐదుగురు చనిపోవడంతో వారి కుటుంబాలకు అండగా నిలవాల్సిన పోలీసులు ప్రమాదానికి కారకుడిగా భావిస్తు న్న ప్రతా్‌పరెడ్డికి కొమ్ముకాస్తూ కేసు నీరుగార్చేందుకు ప్ర యత్నిస్తుండటం దారుణమంటూ కుటుంబ సభ్యులు మం డిపడ్డారు. ప్రతాప్‌ రెడ్డిపై కేసు నమోదు చేయడంలో పోలీ సుల వైఖరిని నిరసిస్తూ మృతుల కుటుంబ సభ్యులు పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి వద్ద సోమవారం ఆందోళనకు ది గారు. గంటపాటు రోడ్డుపై బైఠాయించి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  తాము ఇచ్చిన ఫిర్యాదు మేర కు కాకుండా ప్రతాప్‌రెడ్డి ఇంటి పేరు, తండ్రి పేరు నమో దు చేయకుండా కేసును పక్కదారి పట్టించేందుకు రాయబారాలు నడపటం దుర్మార్గమని మండిపడ్డారు.  పోలీసు లు న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారే తప్పా.. కేసు నమోదు చేయడం లేదంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు. తామిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తే తప్పా.. ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కుటుంబ సభ్యులను కోల్పోయి, బాధలో ఉన్న తమను పోలీసుల తీరు మరింత ఆవేదనకు లోను చేస్తోందంటూ కన్నీరు పెట్టుకున్నారు. ట్రాఫిక్‌ స్తంభించిపోవడంతో పోలీసులు.. బాధితులను బతిమలాడి, నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.Advertisement
Advertisement