వందేళ్ల మర్రి చెట్టుపై యాసిడ్‌

ABN , First Publish Date - 2020-06-04T09:09:59+05:30 IST

మండల కేంద్రమైన కోటవురట్లలో వందేళ్ల పైబడిన ఓ భారీ మర్రి చెట్టుపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్‌ పోయడం పర్యావరణ ప్రేమికులను ..

వందేళ్ల మర్రి చెట్టుపై యాసిడ్‌

ఆవేదన వ్యక్తం చేస్తున్న పర్యావరణ ప్రేమికులు

పోలీసులకు సమాచారం అందడంతో విచారణ


కోటవురట్ల : మండల కేంద్రమైన కోటవురట్లలో వందేళ్ల పైబడిన ఓ భారీ మర్రి చెట్టుపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్‌ పోయడం పర్యావరణ ప్రేమికులను కలచి వేస్తోంది. వరహా నది ఒడ్డున మసీదు సమీపంలో ఉన్న ఈ భారీ చెట్టు ఎందరికో నీడనిస్తోంది.  ఈ చెట్టుకు ఉన్న ఓ కొమ్మ ఇబ్బందిగా ఉందని భావించినవారు మంగళవారం ఇందుకు పాల్పడి ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు.  చెట్టునుంచి పొగలు రావడంతో సమీపంలోని వారు పోలీసులకు సమాచారం అందించారు.  మంగళవారం రాత్రి ఎస్‌ఐ సురేష్‌కుమార్‌ వచ్చి పరిశీలించారు. చెట్టుకు రంధ్రం పెట్టి యాసిడ్‌ పోసినట్టు గుర్తించారు. ఈ ఘటనపై కొందరిని విచారించినట్టు తెలిసింది. అంతేకాకుండా ఈ చెట్టు చనిపోకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నారు.

Updated Date - 2020-06-04T09:09:59+05:30 IST