అవినీతికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-06-18T06:03:20+05:30 IST

ధర్మపురి మున్సిపాలిటీలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ ఫ్లోర్‌ లీ డర్‌, కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్‌ వేముల నాగలక్ష్మి డిమాండ్‌ చేశారు.

అవినీతికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న మున్సిసల్‌ ఫ్లోర్‌ లీడర్‌ వేముల నాగలక్ష్మి

మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ వేముల నాగలక్ష్మి డిమాండ్‌

ధర్మపురి, జూన్‌ 17: ధర్మపురి మున్సిపాలిటీలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ ఫ్లోర్‌ లీ డర్‌, కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్‌ వేముల నాగలక్ష్మి డిమాండ్‌ చేశారు. స్థా నిక హరిత హోటల్‌లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కౌన్సిలర్లతో గురువా రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కొంత కాలంగా మున్సిపాలిటీలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తుల గురించి ప్రశ్నిస్తే చైర్‌పర్సన్‌ సత్యమ్మ, కుటుంబ సభ్యులు కలిసి బెదిరిం పులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. 2013 నుంచి 2018 వర కు మేజర్‌ గ్రామపంచాయితీ సర్పంచ్‌గా, ప్రస్తుతం మున్సిపల్‌ చైర్‌ప ర్సన్‌గా సత్యమ్మ కొనసాగుతోందని ఆమె తెలిపారు. ఆమె పదవీ కాలం లో ఇప్పటి వరకు ఎస్టిమేషన్‌, కొటేషన్‌, ఎంబీ రికార్డు లేకుండా లక్షలా ది రూపాయల బిల్లులు డ్రా చేసినట్లు ఆమె వివరించారు. చైర్‌పర్సన్‌ తనయుడు వివిధ పనుల పేరిట రూ 72,82,706 బిల్లులు తయారు చేయించి 20 పైగా చెక్కులు డ్రా చేసినట్లు ఆమె తెలిపారు. ఎస్‌ఆర్‌ ఎస్‌పీ క్వార్టర్స్‌ సమీపంలో మిషన్‌ భగీరథ పనుల గోదాం కోసం డీఎల్‌ పీవోను కూడ తప్పుదోవ పట్టించినారని ఆమె అన్నారు. మున్సిపల్‌లో పని చేస్తున్న ఒక ఉద్యోగి పేరుతో 5 రకాల పనుల కోసం రూ 3 లక్షలు నిధులు డ్రా చేసినందులకు చర్యలు తీసుకోవాలని ఆమె కోరా రు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన వ్యక్తుల గురించి తమ వద్ద పూర్తి గా ఆధారాలు ఉన్నాయని, ఎప్పుడైన నిరూపించేందుకు సిద్ధంగా ఉన్న ట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు సంగనభట్ల సంతోషి, జక్కు పద్మ, గరిగె అరుణ, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు దినేష్‌, ఉపా ధ్యక్షుడు రాజేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-18T06:03:20+05:30 IST