సీజన్‌లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2020-05-17T10:30:52+05:30 IST

వర్షాకాల సీజన్‌లో వచ్చే వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కె శశాంక

సీజన్‌లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి

జిల్లా కలెక్టర్‌ కె శశాంక


కరీంనగర్‌, మే 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వర్షాకాల సీజన్‌లో వచ్చే వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కె శశాంక వైద్యాధికారులను కోరారు. శనివారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశం మందిరంలో వివిధ జాతీయ కార్యక్రమాల ప్రోగ్రాం అధికారులతో సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం జ్వరాలు ఎక్కువగా వచ్చిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి ఉంచాలన్నారు. జూన్‌ 1 నుంచి 15వ తేదీలోపు కీటకనాశక మందులు చల్లడం పూర్తిచేయాలన్నారు. జూలై 1 నుంచి 15వ తేదీలోపు రెండో విడత పూర్తిచేయాలన్నారు. 30వ తేదీలోపు ఇందుకు సంబంధించిన ప్రణాళికలు పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లా ప్రధాన వైద్యశాల సూపరిండెంట్‌ ఎంసీహెచ్‌ అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుజాత, జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌, ఎంసీహెచ్‌ అధికారులు  పాల్గొన్నారు.

Updated Date - 2020-05-17T10:30:52+05:30 IST