నిషేధిత మందులు అమ్మితే చర్యలు

ABN , First Publish Date - 2021-07-30T04:49:58+05:30 IST

నిషేధిత కలుపు నివార ణమందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తా మని ఏడీఏ నరసింహా రెడ్డి హెచ్చరించారు.

నిషేధిత మందులు అమ్మితే చర్యలు
దుకాణాన్ని పరిశీలిస్తున్న ఏడీఏ

ఖాజీపేట, జూలై 29: నిషేధిత కలుపు నివార ణమందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తా మని ఏడీఏ నరసింహా రెడ్డి హెచ్చరించారు. ఖా జీపేటలోని పలు దుకా ణాలను గురువారం ఏఓ శివశైలజతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ ల్లో రెండు దుకాణాల్లో నిషేధిత కలుపు నివారణ మందులు దొరికా యన్నారు. లైసెన్స్‌ రెన్యువల్‌ కాని మరో రెండు దుకాణాల అమ్మకా ల ను నిలుపుదల చేశామన్నారు. నిషేధిత మందులు అమ్ముతున్న వా రిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా అమ్మినా వారి లైసె న్సు రద్దు చేసి క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు.

Updated Date - 2021-07-30T04:49:58+05:30 IST